News September 9, 2025
ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశం

మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. జగన్ నెల్లూరు పర్యటన సమయంలో ఆయనతో పాటు 17 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిపై ఆయన కోర్టుకు వెళ్లారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ప్రసన్నను అరెస్ట్ చేయొద్దని సోమవారం సాయంత్రం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Similar News
News September 9, 2025
నెల్లూరు: రేషన్ డీలర్స్‌కి కొత్త మిషన్లు

నెల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని పలు మండలాల రేషన్ డీలర్స్‌కు ప్రభుత్వం తీసుకోచ్చిన నూతన మిషన్లను నెల్లూరు అర్బన్ MRO ఆఫీసులో అందజేశారు. వీటి ద్వారా సరుకులను సులభతరంగా ఇచ్చేందుకు వీలుగా ఉంటుందని సిబ్బంది తెలిపారు. గతంలో బటన్స్ నొక్కి ఇచ్చేందుకు ఇబ్బంది పడేవారు. కొత్త మిషన్లకు టచ్ స్క్రీన్ ఇవ్వడంతో నంబర్లను ఎంటర్ చేసేందుకు సులువుగా ఉంది. డివిజన్ పరిధిలో 300 వరకు మంగళవారం అందించినట్లు చెప్పారు.
News September 9, 2025
పోలేరమ్మ జాతర నైవేద్యంతో ఆరోగ్యం

వెంకటగిరి శ్రీ పోలేరమ్మ తల్లికి జాతర సందర్భంగా పెట్టే నైవేద్యంలో అనేక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. వేపాకు అంటు వ్యాధులు ప్రబలకుండా వైరస్‌ను నివారిస్తుంది. సొంటి అన్నం వల్ల కడుపు శుద్ది చేయడంతో పాటు శారీరక ఎదుగుదలకు తోడ్పడుతుంది. కుడుములు వల్ల ఊపిరితిత్తులు, కండరాలు, నరములకు శక్తి లభిస్తుంది. మునగాకు వల్ల జీర్ణశక్తి, జాయింట్ పెయిన్ రిలీఫ్‌కి ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్త్రీయంగా నిరూపణ అయింది.
News September 9, 2025
ఉదయగిరి: అంగన్వాడీలకు తప్పని రేషన్ తిప్పలు

ఉదయగిరి అంగన్వాడీ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీలకు రేషన్ తిప్పలు తప్పడం లేదు. గత కొద్ది నెలలుగా రేషన్ షాపు మిషన్‌లో, అంగన్వాడీ యాప్‌లలో స్టాకు వచ్చినట్లు ఉన్నా తమకు సరుకులు రాలేదంటూ రేషన్ డీలర్లు చెబుతున్నారన్నారు. కొన్నిచోట్ల నూనె, కందిపప్పు ఇవ్వాలంటూ డీలర్లు ఒత్తిడి చేస్తున్నారని అంగన్వాడీలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు సమస్యపై దృష్టి సాధించి పరిష్కరించాలని కోరుతున్నారు.