News September 9, 2025

ఓయూలో నిపుణులను తయారు చేయడమే లక్ష్యం: వీసీ

image

విద్యార్థులను పరిశ్రమకు సిద్ధం చేసే నిపుణులుగా తీర్చిదిద్దడమే AI, ML& డేటా అనలిటిక్స్‌లోని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం లక్ష్యమని ఓయూ వీసీ ప్రొ. కుమార్‌ మోలుగరం అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఇంజినీరింగ్ కళాశాలకు అభినందించారు. సర్టిఫికేషన్‌ కోర్సులు, వర్క్‌షాప్‌లు నిర్వహించి మరింత ప్రాక్టికల్‌ నైపుణ్యాలు అందిస్తామన్నారు. ఇందులో ఏఐ లింక్‌ బృందం కీలకపాత్ర పోషించిందని ప్రశంసించారు.

Similar News

News September 10, 2025

ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు కిషన్‌రెడ్డి శుభాకాంక్షలు

image

దేశ 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన పొన్నుస్వామి రాధాకృష్ణన్‌ను పార్లమెంట్ భవన్‌లో మంగళవారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కలిసి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సాధారణ కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించి.. క్రమశిక్షణ, అకుంఠిత దీక్షతో నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు శ్రమించి ఇవాళ ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని అభిప్రాయపడ్డారు.

News September 10, 2025

మనీలాండరింగ్ రాకెట్‌ను ఛేదించిన ఈగిల్ ఫోర్స్

image

అంతర్జాతీయ మాదకద్రవ్యాల మనీలాండరింగ్ రాకెట్‌ను తెలంగాణ ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్‌మెంట్ (EAGLE) ముంబైలో ఛేదించింది. ఈగిల్ ఫోర్స్ ఆధ్వర్యంలో రాచకొండ నార్కోటిక్స్ పోలీసులు నగరంలోని వినియోగదారులకు కొకైన్ మరియు ఎక్స్‌సీ మాత్రలను విక్రయించడానికి ప్రయత్నిస్తుండగా మాక్స్వెల్‌ను అరెస్టు చేశారు. అతడు ఇటీవల జరిగిన 150 లావాదేవీలలో పాల్గొన్నాడు. మొత్తం 50 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

News September 10, 2025

HYD: కాళోజి మాటలు అందరికీ స్ఫూర్తి కావాలి

image

పద్మ విభూషణ్, ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమమే ఊపిరిగా కాళోజి జీవించారని పేర్కొన్నారు. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని ఆయన చెప్పిన మాటలు అందరికీ స్ఫూర్తి కావాలని ఆకాంక్షించారు.