News September 9, 2025
టీటీడీ పాలకమండలి సమావేశం రద్దు

రేపు జరగాల్సిన టీటీడీ పాలకమండలి సమావేశం రద్దు అయింది. ఈఓ శ్యామలరావు బదిలీతో రేపు బోర్డు సమావేశంతో పాటు ఇవాళ జరగాల్సిన విభాగాధిపతుల సమీక్షా సమావేశం కూడా రద్దు అయింది. 700 వేదపారాయణదారుల భర్తీ ప్రక్రీయను తాత్కాలికంగా నిలుపుదల చేశారు.టీటీడీ ఛైర్మన్ బీఅర్ నాయుడు అదేశాలతో అర్హులైన బ్రాహ్మణులకు న్యాయం జరిగేలా త్వరలో పారదర్శకంగా వేదపారాయణదారులు పోస్టులను భర్తీ చేయనున్నారు.
Similar News
News September 10, 2025
జిల్లాలో ఎరువుల కొరత లేదు: కలెక్టర్

ఏలూరు జిల్లాలో ఎక్కడా యూరియా, ఎరువుల కొరత లేదని కలెక్టర్ కె. వెట్రిసెల్వి మంగళవారం తెలిపారు. పోలవరం మండలం ప్రగడపల్లి సొసైటీలో 25 మెట్రిక్ టన్నులు, జిల్లెళ్లగూడెం, వింజరం రైతు సేవా కేంద్రాలకు 12.5 మెట్రిక్ టన్నుల చొప్పున ఒక్కరోజులోనే అదనంగా సరఫరా చేశామని చెప్పారు. రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు అందిస్తామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు.
News September 10, 2025
నేటి ముఖ్యాంశాలు

* ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన C.P.రాధాకృష్ణన్
* క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ప్రారంభించిన మంత్రి దామోదర
* గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు రద్దు: TG హైకోర్టు
* సీఎంకు, నాకు లై డిటెక్టర్ టెస్ట్ చేయండి: KTR
* 4 దశల్లో ఏపీలో స్థానిక ఎన్నికలు: SEC
* ఏపీలో ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ విడుదల
* నేపాల్‌లో ఆర్మీ పాలన.. ప్రధాని రాజీనామా
* నేపాల్ మంత్రులను తరిమికొట్టిన నిరసనకారులు
News September 10, 2025
ఉపరాష్ట్రపతి ఎన్నికలో క్రాస్ ఓటింగ్?

ఉపరాష్ట్రపతి ఎన్నికలో గెలిచిన NDA అభ్యర్థికి 452 ఓట్లు పోలయ్యాయి. ఎన్డీఏకు 427+11(వైసీపీ) ఎంపీల సపోర్ట్ ఉంది. దీని ప్రకారం NDAకు 438 ఓట్లు పోలవ్వాల్సి ఉండగా 14 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఇవి క్రాస్ ఓటింగ్ ఓట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు ఇండీ కూటమి ఎంపీలు 315మంది ఓట్లేశారని జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. కానీ ఫలితాల్లో వారి అభ్యర్థికి 300 ఓట్లే పడ్డాయి. మరోవైపు 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు.