News April 4, 2024

శ్రీకాకుళం: ‘ఎలాంటి ప్ర‌చారానికైనా అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి’

image

రాజ‌కీయ పార్టీలు, అభ్య‌ర్థులు చేప‌ట్ట‌బోయే ఎలాంటి ప్ర‌చారానికైనా సంబంధిత ఎన్నిక‌ల అధికారుల నుంచి అనుమ‌తులు తీసుకోవాల్సిందేన‌ని జిల్లా ఎన్నిక‌ల అధికారి, జిల్లా క‌లెక్ట‌ర్ మనజీర్ జిలానీ సమూన్ స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో 40వ వారపు స‌మావేశాన్ని బుధవారం నిర్వ‌హించారు. ప్రచార అనుమతులకు ద‌ర‌ఖాస్తు చేసుకున్న 48 గంట‌ల్లోగా ఏక‌గ‌వాక్ష విధానం ద్వారా అనుమ‌తులు ఇస్తామ‌న్నారు.

Similar News

News April 18, 2026

నాడు శ్రీకాకుళం కలెక్టర్.. నేడు స్టేట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్

image

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా పనిచేసి, ఉత్తమ కలెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ చంద్ర పునేఠా నేడు రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసింది. 1993-96 మధ్యకాలంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా పని చేసిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి సీఎస్ స్థాయికి చేరారు. ప్రస్తుతం విజిలెన్స్ కమిషనర్‌గా ఉన్న ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా నియమించింది.

News April 18, 2026

శ్రీకాకుళం: పనికి రాదని పడేసే జీడి తొక్కతో లాభాలు

image

ఒకప్పుడు ఉపయోగం లేక పారబోసే జీడితొక్క ఇప్పుడు మంచి ఆదాయ వనరుగా మారింది. పలాస-కాశీబుగ్గలో జీడి ఆయిల్ పరిశ్రమలు ఏర్పడడంతో తొక్కకు డిమాండ్ పెరిగింది. గతంలో కిలో రూ.3కు అమ్మిన జీడితొక్క ధర ప్రస్తుతం రూ.15కు చేరింది. ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావంతో జీడిఆయిల్ ఎగుమతులు పెరగడం దీనికి కారణం. రోజుకు వేల బస్తాల తొక్క పరిశ్రమలకు చేరుతుండగా, వ్యాపారులు గోనె సంచుల్లో నిల్వ చేసి విక్రయస్తున్నారు.

News April 18, 2026

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

✮జలం-జీవంపై దృష్టి సారించాలి: కలెక్టర్
✮మెళియాపుట్టి: రోగులకు మెరుగైన సేవలందించాలి -ఐటీడీఏ పీఓ
✮శ్రీకాకుళం జిల్లాలో ఓటర్లు ఎంతమంది అంటే?
✮గ్రామ స్థాయిలో వైసీపీ బలోపేతమవ్వాలి: మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి
✮టెక్కలి: బంగారం దుకాణాల్లో చోరీ.. దొంగ అరెస్ట్
✮సోంపేటలో ఈనెల 20న జాబ్ మేళా
✮ప్రజాదర్బా‌ర్‌లో ఎమ్మెల్యే బగ్గు వినతుల స్వీకరణ