News September 9, 2025

ఏపీ వైద్యారోగ్యశాఖలో 185 పోస్టులు

image

<>ఏపీ వైద్యారోగ్యశాఖ<<>>లో 185 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒప్పంద ప్రాతిపదికన వీటిని భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు. దరఖాస్తు ఫీజు రూ.1000, బీసీ, ఎస్సీ, ఎస్టీలు రూ.750 చెల్లించాలి. వెబ్‌సైట్: https://apmsrb.ap.gov.in/

Similar News

News September 12, 2025

మెడికల్ కాలేజీల టెండర్లపై జగన్ వార్నింగ్.. సజ్జల ఏమన్నారంటే?

image

AP: మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయకూడదనే ఉద్దేశంతోనే జగన్ మెడికల్ కాలేజీల టెండర్లపై హెచ్చరికలు జారీ చేశారని YCP సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘కోర్ సెక్టార్స్‌లో ప్రభుత్వ ప్రాధాన్యం ఉండాలనేదే మా లక్ష్యం. ప్రభుత్వ సంస్థను ప్రైవేటుపరం చేస్తుంటే కచ్చితంగా హెచ్చరిస్తాం’ అని అన్నారు. ఇక తమ మద్దతుదారులపై అక్రమ కేసులు పెడుతున్నందుకే కొందరు పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

News September 12, 2025

లిక్కర్ కేసు నిందితులకు రిమాండ్ పొడిగింపు

image

AP: లిక్కర్ స్కామ్ కేసులో 10 మంది నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 18 వరకు రిమాండ్ పొడిగించింది. ఇవాళ్టితో నిందితుల రిమాండ్ ముగియనుండటంతో సిట్ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. అలాగే మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఫోన్‌ను FSLకు పంపేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన ఫోన్‌ను అధికారులు సీజ్ చేసే అవకాశం ఉంది.

News September 12, 2025

మేం చేసిన ఖర్చు అభివృద్ధిలో కనిపించింది: బుగ్గన

image

AP:YCP ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తే రాష్ట్రం దివాలా తీస్తోందంటూ ఆనాడు TDP ఆరోపించిందని మాజీ మంత్రి బుగ్గన Way2News కాన్‌క్లేవ్‌లో చెప్పారు. వాటిని మించి ఇచ్చిన అభివృద్ధి హామీలను నెరవేర్చాలని, లేకపోతే తప్పు చేసినట్లు ప్రభుత్వం ఒప్పుకోవాలని కోరారు. YCP హయాంలో చేసిన ఖర్చు అభివృద్ధిలో కనిపించిందన్నారు. తమ ప్రభుత్వంలో GST వసూళ్లు పెరిగితే, కూటమి ప్రభుత్వ హయాంలో ఎందుకు పెరగడంలేదని ప్రశ్నించారు.