News April 4, 2024

జైల్లో కేజ్రీవాల్‌కు కెటిల్, టేబుల్, కుర్చీ

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు జైలులో అవసరమైన కొన్ని సదుపాయాలు అందించేందుకు కోర్టు అనుమతించింది. కేజ్రీవాల్ ఆరోగ్యం దృష్ట్యా నీటిని వేడి చేసి తాగేందుకు ఎలక్ట్రిక్ కెటిల్ అవసరమని ఆయన తరఫు లాయర్ అభ్యర్థించారు. అలాగే పుస్తకాలు చదివేందుకు టేబుల్, కుర్చీ అవసరమని విన్నవించారు. దీంతో ఆయా వసతులను కల్పించాలని రౌస్ అవెన్యూ కోర్టు తీహార్ జైలు అధికారులు ఆదేశించింది.

Similar News

News October 7, 2024

స‌మోసాలు, చిప్స్‌, కుకీలతో మధుమేహం!

image

స‌మోసాలు, చిప్స్‌, కుకీలు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌ మ‌ధుమేహానికి దారితీస్తున్నట్టు ICMR-MDRF ప‌రిశోధ‌న‌లో తేలింది. అధిక ఉష్ణోగ్ర‌త‌లో వండే ఈ ప‌దార్థాల్లో అడ్వాన్స్‌డ్‌ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్(AGEs) అధికంగా ఉంటాయి. ప్రొటీన్లు, గ్లూకోజ్ గ్లైకేష‌న్ ద్వారా ఇది ఏర్ప‌డుతుంది. అధిక AGEs ప‌దార్థాలు టైప్2 డయాబెటిస్‌కు కారణమని వైద్యులు చెబుతున్నారు. వేయించిన ఆహారాన్ని తిన‌డం త‌గ్గించాలని సూచిస్తున్నారు.

News October 7, 2024

రూ.35,000 కోసం పెళ్లి చేసుకున్న అన్నాచెల్లెళ్లు!

image

ప్రభుత్వం అమలు చేస్తున్న సామూహిక వివాహ పథకం ప్రయోజనాలు (రూ.35,000) పొందడం కోసం అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్న ఘటన యూపీలో జరిగింది. ఈ ఏడాది మార్చి 5న ఈ ఘటన జరగగా, స్థానికుల సమాచారంతో అధికారులు తాజాగా చర్యలకు ఉపక్రమించారు. యువతికి ఇదివరకే వివాహం జరగగా, డబ్బుల కోసం మరోసారి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశారు. వరుడు సమయానికి రాకపోవడంతో వధువు, ఆమె సోదరుడు పెళ్లి చేసుకున్నారు.

News October 7, 2024

గ్రూప్-4 అభ్యర్థులకు GOOD NEWS!

image

TG: గ్రూప్-4 పరీక్ష ఫైనల్ సెలక్షన్ ప్రక్రియను త్వరలోనే చేపడతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఇవాళ కొంతమంది అభ్యర్థులు మంత్రిని కలిసి తమ సమస్యను విన్నవించారు. తుమ్మల TGPSC ఛైర్మన్ మహేందర్ రెడ్డికి కాల్ చేసి.. తుది ఫలితాలను వెంటనే ప్రకటించాలని కోరారు. కాగా, 2023లో గ్రూప్-4 పరీక్షలు నిర్వహించగా, 45 రోజుల క్రితం సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయింది. కానీ నియామక ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది.