News September 9, 2025
పిల్లలు వెళ్లాల్సింది బడికి.. పనికి కాదు: వరంగల్ పోలీసులు

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు వరంగల్ కమిషనరేట్ పోలీసులు పిలుపునిచ్చారు. ‘పిల్లలు వెళ్లాల్సింది బడికి.. పనికి కాదు’ అనే సందేశంతో అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేశారు. బాలల హక్కులను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఎక్కడైనా బాలకార్మికులపై సమాచారం లభిస్తే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కి చెప్పాలరి పోలీసులు కోరారు. చిన్నారుల భవిష్యత్తు కోసం సమాజం మొత్తం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Similar News
News September 10, 2025
అనకాపల్లి: ‘పాడైపోయిన ఐరన్ వస్తువులకు వేలం’

పాడైపోయిన ఐరన్ వస్తువులకు విశాఖ కైలాసగిరి ఆర్ముడ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్‌లో ఈనెల 11న ఉదయం 10 గంటలకు వేలంపాట నిర్వహించనున్నట్లు అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. వేలం పాటలో పాల్గొనేవారు ఆధార్ కార్డు జిరాక్స్‌తో పాటు రూ.500 డిపాజిట్ చెల్లించాలన్నారు. వేలం పాటను ఖరారు చేసుకున్నవారు అక్కడికక్కడే నగదు చెల్లించాలన్నారు. దీనికి 18 శాతం జీఎస్టీతో పాటు 12% ఇతర ఛార్జీలు అదనంగా చెల్లించాలన్నారు.
News September 10, 2025
ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లు వచ్చేశాయ్!

యాపిల్ ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ చేసింది. ‘ఐఫోన్ ఎయిర్’ పేరిట అత్యంత సన్నగా ఉండే మోడల్‌ను తీసుకొచ్చింది. ఇది 6.5 ఇంచ్ ప్రో మోషన్ డిస్‌ప్లేతో వస్తుంది. అటు ఐఫోన్ 17లో 6.3inch డిస్‌ప్లే, 120hz రిఫ్రెష్ రేట్, 3NM A19 సిలికాన్ చిప్ ఉంటాయి. అన్ని మోడల్స్‌లో ఇంటర్నల్ బేస్ స్టోరేజ్ 256GBగా ఉంది. 17 ప్రో, ప్రో మాక్స్‌లో 48MP ట్రిపుల్ కెమెరా, A19 ప్రో చిప్ వంటి ఫీచర్లున్నాయి. వివరాలకు ఇక్కడ <
News September 10, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.