News September 9, 2025

HYD: అలా అయితే.. నిజంగా ఇది ‘భాగ్య’నగరమే.. !

image

మహానగర విస్తరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా మెట్రోను ప్రజలకు మరింత చేరువ చేయాలని భావిస్తోంది. 2050 నాటికి 31 రూట్లలో 662 KM మెట్రో రైళ్లు నడపాలని ముసాయిదా సిద్ధమైంది. నిజంగా ఇది అమలైతే.. నగర వాసికి ట్రాఫిక్ చిక్కులు తప్పినట్టే. త్వరలో 200 కిలోమీటర్లు, భవిష్యత్తులో 662 కిలోమీటర్ల మెట్రో అందుబాటులోకి వస్తే నిజంగా ఇది ‘భాగ్య’నగరమే అవుతుంది.

Similar News

News September 10, 2025

ఇకపై ఓయూ విద్యార్థులకు ఏఐ, ఎంఎల్ నైపుణ్యాలు

image

ఓయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు AI, మిషన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్ రంగాలలో నైపుణ్యాలు పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఏఐ లింక్ టెక్నాలజీస్ సంస్థతో ఓయూ ఇంజినీరింగ్ కళాశాల అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థులను అత్యాధునిక నైపుణ్యాలతో నిపుణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇరువర్గాలు ఒప్పందంపై సంతకాలు చేశారు. JNTUHలో ఇప్పటికే ఈ పద్ధతిలో బోధిస్తున్నారు.

News September 10, 2025

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో క్యాన్సర్ కేర్ సెంటర్

image

మంత్రి దామోదర్ రాజనర్సింహ వర్చువల్‌‌గా 33 జిల్లాల ప్రభుత్వ ఆస్పత్రుల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లను ప్రారంభించారు. ఇందులో భాగంగా గాంధీ ఆస్పత్రిలో పాలియేటివ్ కేర్ సెంటర్ ఓపెనింగ్ కార్యక్రమం వర్చువల్‌గా జరిగింది. సూపరింటెండెంట్ డా.రాజకుమారి, ప్రిన్సిపల్ డా.ఇందిర, డిప్యూటీ సూపరింటెండెంట్ డా.సునీల్, RMO డా.శేషాద్రి, వైస్ ప్రిన్సిపల్ డా.రవిశేఖర్ రావు పాల్గొన్నారు.

News September 10, 2025

ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు కిషన్‌రెడ్డి శుభాకాంక్షలు

image

దేశ 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన పొన్నుస్వామి రాధాకృష్ణన్‌ను పార్లమెంట్ భవన్‌లో మంగళవారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కలిసి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సాధారణ కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించి.. క్రమశిక్షణ, అకుంఠిత దీక్షతో నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు శ్రమించి ఇవాళ ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని అభిప్రాయపడ్డారు.