News September 9, 2025

హైకోర్టు తీర్పు రేవంత్ సర్కార్‌కు చెంపపెట్టు: హరీశ్

image

TG: CM రేవంత్ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని BRS నేత హరీశ్ రావు మండిపడ్డారు. గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని ఆయన ట్వీట్ చేశారు. ‘పరీక్షలు ఎలా నిర్వహించాలో కూడా ప్రభుత్వానికి తెలియదు. పరీక్షలు నిర్వహించడం, ఉద్యోగాలు ఇవ్వడమంటే చిల్లర రాజకీయాలు చేసినంత ఈజీ కాదు. ఇప్పటికైనా CM స్పందించి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.

Similar News

News February 25, 2026

కంచె వేసినదే కమతము

image

పంట పండించే భూమికి (కమతము) రక్షణగా కంచె ఉంటే ఆ భూమిలో అధిక దిగుబడి వస్తుంది. కంచె లేకపోతే పశువులు మేసేయడం లేదా ఇతరులు పాడుచేసే అవకాశం ఉండటం వల్ల దిగుబడి చాలా వరకు తగ్గుతుంది. అంటే, రక్షణ లేని ఆస్తి ఎప్పుడూ ప్రమాదంలోనే ఉంటుంది. మనం జీవితంలో కూడా ఎంత సంపాదించినా, దానికి పొదుపు లేదా క్రమశిక్షణ అనే కంచె లేకపోతే ఆ సంపాదన హరించుకుపోతుందని ఈ సామెత తెలియజేస్తుంది.

News February 25, 2026

మంత్ర పఠనం వల్ల కలిగే మానసిక ప్రయోజనాలు

image

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మంత్ర పఠనం ఓ ఔషధంగా పనిచేస్తుంది. ఇది మానసిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మంత్రాలను క్రమం తప్పకుండా పఠిస్తే మన చుట్టూ ‘మంత్ర కవచం’ అనే రక్షణ వలయం ఏర్పడుతుంది. ఇది ప్రతికూల ఆలోచనలను తొలగించి, సానుకూల శక్తిని నింపుతుంది. ఏకాగ్రత పెంచి, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. భగవంతునితో అనుసంధానం కావడానికి, ఆత్మశాంతిని పొందడానికి మంత్ర పఠనం ఓ సులభమైన మార్గం.

News February 25, 2026

జీడీపీ దూకుడు: 8 శాతం దాటనున్న వృద్ధి!

image

అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి ఏకంగా 8.1 శాతానికి చేరుతుందని ఎస్‌బీఐ నివేదిక అంచనా వేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. గ్రామాల్లో పంటల దిగుబడి బాగుండటం, నగరాల్లో జనం ఖర్చులు పెరగడమే దీనికి కారణం. ఫిబ్రవరి 27న వెలువడే ప్రభుత్వ అధికారిక లెక్కల్లో ఈ విషయం స్పష్టంగా తెలియనుంది.