News September 9, 2025
ఫ్యాట్ ఫోబియా గురించి తెలుసా?

చాలామంది లావుగా ఉండటం వల్ల అందంగా లేమని కుంగిపోతుంటారు. దీన్నే ఫ్యాట్ ఫోబియా అంటారు. ఇది శారీరకంగా, మానసికంగా దెబ్బతీస్తుందని, వారిలో ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అధికబరువు వల్ల ఎందులోనూ సక్సెస్ కాలేమని, ఇతరులతో పోల్చితే తాము తెలివితేటల్లోనూ తక్కువేనని బాధపడతారు. ఫొటోలు, అద్దంలో చూసుకోవడానికి ఇష్టపడరు. ఇలా కాకుండా తమను తాము ప్రేమించుకోవడం నేర్చుకోవాలంటున్నారు నిపుణులు.
Similar News
News September 10, 2025
ఈ వంట ఆడవారికి ప్రత్యేకం..

తమిళనాడులోని తిరునల్వేలిలో ఉళుందాన్‌కలి వంటకాన్ని స్త్రీలకోసం ప్రత్యేకంగా చేస్తారు. ఇది అమ్మాయిల ఎముకలను బలోపేతం చేసి హార్మోన్ల అసమతుల్యతను నివారిస్తుందని నమ్ముతారు. కప్పు మినప్పప్పు, బియ్యం కలిపి వేయించి, పిండి చేస్తారు. ఈ మిశ్రమానికి బెల్లం, నీరు చేర్చి ఉడికిస్తారు. తర్వాత నెయ్యి వేసి, పైకి తేలే వరకూ కలిపితే సరిపోతుంది. దీన్ని జాగ్రత్త చేస్తే నెల నుంచి రెండు నెలల వరకూ నిల్వ ఉంటుంది.
News September 10, 2025
అమ్మాయిలకి ఈ టెస్టులు చేయించండి..

ఆడపిల్లలున్న తల్లిదండ్రులు వారు రజస్వల అయినప్పటి నుంచి వారికి కొన్ని ఆరోగ్య పరీక్షలు కచ్చితంగా చేయించాలంటున్నారు నిపుణులు. రక్తహీనత సమస్యను గుర్తించడానికి కంప్లీట్ బ్లడ్ కౌంట్(సీబీసీ) పరీక్ష, హార్మోన్ల అసమతుల్యతను గుర్తించడానికి థైరాయిడ్, హార్మోన్ల పరీక్షలు, విటమిన్‌ప్రొఫైల్ టెస్ట్, ఏవైనా మూత్ర సంబంధిత సమస్యలుంటే మూత్ర పరీక్ష చేయించాలి. వీటివల్ల ఏవైనా సమస్యలుంటే ముందుగానే గుర్తించే వీలుంటుంది.
News September 10, 2025
యువత ప్రాణాలు తీస్తున్న బ్రేకప్స్

దేశంలో బ్రేకప్‌ల వల్ల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని సూసైడ్ ప్రివెంటివ్ హెల్ప్‌లైన్ సంస్థ ‘వన్ లైఫ్’ తెలిపింది. అప్పులు, వైవాహిక సమస్యలు, నిరుద్యోగం, బెట్టింగ్, ఒత్తిడి, ఆర్థిక మోసాలతో మరికొందరు సూసైడ్ చేసుకుంటున్నట్లు వివరించింది. తమ సంస్థకు ఏటా సగటున 23,000 కాల్స్ వస్తున్నాయంది. ఫోన్ చేసిన వారిపై సానుభూతి చూపిస్తూ కౌన్సిలర్లు వారిలో ధైర్యం నింపుతారని వివరించింది.
* ఇవాళ ఆత్మహత్యల నివారణ దినోత్సవం