News April 4, 2024
6న కావలిలో ఐదో ‘సిద్ధం’ సభ

AP: వైసీపీ ఐదో ‘సిద్ధం’ సభ నెల్లూరు జిల్లా కావలిలో ఈ నెల 6వ తేదీన జరగనుంది. ఈ మేరకు పోస్టర్‌ను ఎంపీ విజయసాయిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యేలు విడుదల చేశారు. కాగా సీఎం జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేటి నుంచి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనుంది. 5వ తేదీన యాత్రకు విరామం ఉంటుంది. 6న కావలి భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు.
Similar News
News April 22, 2025
మామిడి పక్వానికి కార్బైడ్ వాడొద్దు: మంత్రి

TG: మామిడిపండ్లను కృత్రిమంగా మాగ బెట్టేందుకు కార్బైడ్ వంటి నిషేధిత పదార్థాలను ఉపయోగించవద్దని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. నిషేధిత పదార్థాలు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై అవెర్‌నెస్ పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. అవసరమైతే ఎథెఫోన్‌ను ఉపయోగించాలని ఫుడ్ సెఫ్టీ అధికారులు సూచించారు. నిషేధిత పదార్థాలు వాడినట్లు గుర్తిస్తే 9100105795 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.
News April 22, 2025
16 బోగీలతో నమో ర్యాపిడ్ రైలు.. 24న ప్రారంభం

దేశంలోనే తొలిసారి 16 బోగీలతో నమో భారత్ ర్యాపిడ్ రైలు బిహార్‌లోని జయ్‌నగర్-పట్నా మధ్య సేవలందించనుంది. ఈ నెల 24న దీన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దాదాపు 2వేల మంది కూర్చునే వీలున్న ఈ రైలు గరిష్ఠంగా 110కి.మీ.ల వేగంతో దూసుకెళ్లనుంది. మరో వెయ్యి మంది నిలబడి ప్రయాణించవచ్చు. తొలి నమో భారత్ రైలు 12 కోచ్‌లతో గతేడాది సెప్టెంబర్‌లో అహ్మదాబాద్-భుజ్ మధ్య ప్రారంభమైన విషయం తెలిసిందే.
News April 22, 2025
ఏప్రిల్ 22: చరిత్రలో ఈరోజు

✒ 1870: రష్యా విప్లవకారుడు వ్లాదిమిర్ లెనిన్ జననం
✒ 1914: దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బీఆర్ చోప్రా జననం(ఫొటోలో)
✒ 1916: ప్రముఖ బెంగాళీ నటి కనన్ దేవి జననం
✒ 1939: చిత్రకారుడు, రచయిత శీలా వీర్రాజు జననం
✒ 1959: ఎంపీ దగ్గుబాటి పురందీశ్వరి జననం
✒ 1994: US మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ మరణం
✒ 2018: తొలితరం సంగీత దర్శకుడు బాలాంత్రపు రజనీకాంతరావు మరణం