News April 4, 2024
తొలి మ్యాచ్‌లోనే POTM అవార్డు అందుకుంది వీరే

తానాడిన తొలి మ్యాచ్‌లోనే లక్నో యంగ్ బౌలర్ మయాంక్ యాదవ్ సంచలన ప్రదర్శన చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నారు. ఇంతకుముందు కూడా IPLలో కొంత మంది ప్లేయర్లు ఇలాంటి ప్రదర్శనే చేసి తమ తొలి మ్యాచ్‌లోనే POTM అవార్డు అందుకున్నారు. మెక్‌కల్లమ్, మైక్ హస్సీ, మహరూఫ్, అక్తర్, గోస్వామి, థెరాన్, పరమేశ్వరన్, రిచర్డ్ లెవి, స్టీవ్ స్మిత్, మనన్ వోహ్రా, ఆండ్రూ టై, ఆర్చర్, అల్జారీ జోసెఫ్, గుర్నీ, ఒడియన్ స్మిత్ ఉన్నారు.
Similar News
News April 22, 2025
మామిడి కృత్రిమ పక్వానికి ఇది వాడండి

మామిడి కృత్రిమ పక్వానికి నిషేధిత పదార్థాలు కాకుండా ఎథెఫోన్‌ను ఉపయోగించాలని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచిస్తున్నారు. 10కేజీల మామిడికి 500mg ఎథెఫోన్ వాడాలని చెబుతున్నారు. ముందుగా ఎథెఫోన్ సాచెట్‌ను నీటిలో నానబెట్టి, చిన్న ప్లాస్టిక్ పెట్టెలో ఉంచాలి. ఆ తర్వాత పండ్ల పెట్టెను గాలి చొరబడకుండా ఉంచి ఎథెఫోన్ సాచెట్ ఉన్న బాక్స్‌ను 24 గంటల పాటు ఉంచాలని చెబుతున్నారు.
News April 22, 2025
మామిడి పక్వానికి కార్బైడ్ వాడొద్దు: మంత్రి

TG: మామిడిపండ్లను కృత్రిమంగా మాగ బెట్టేందుకు కార్బైడ్ వంటి నిషేధిత పదార్థాలను ఉపయోగించవద్దని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. నిషేధిత పదార్థాలు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై అవెర్‌నెస్ పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. అవసరమైతే ఎథెఫోన్‌ను ఉపయోగించాలని ఫుడ్ సెఫ్టీ అధికారులు సూచించారు. నిషేధిత పదార్థాలు వాడినట్లు గుర్తిస్తే 9100105795 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.
News April 22, 2025
16 బోగీలతో నమో ర్యాపిడ్ రైలు.. 24న ప్రారంభం

దేశంలోనే తొలిసారి 16 బోగీలతో నమో భారత్ ర్యాపిడ్ రైలు బిహార్‌లోని జయ్‌నగర్-పట్నా మధ్య సేవలందించనుంది. ఈ నెల 24న దీన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దాదాపు 2వేల మంది కూర్చునే వీలున్న ఈ రైలు గరిష్ఠంగా 110కి.మీ.ల వేగంతో దూసుకెళ్లనుంది. మరో వెయ్యి మంది నిలబడి ప్రయాణించవచ్చు. తొలి నమో భారత్ రైలు 12 కోచ్‌లతో గతేడాది సెప్టెంబర్‌లో అహ్మదాబాద్-భుజ్ మధ్య ప్రారంభమైన విషయం తెలిసిందే.