News September 9, 2025

Way2News కాన్‌క్లేవ్: వైసీపీ నుంచి బుగ్గన, సజ్జల

image

AP: విజయవాడ CK కన్వెన్షన్‌లో ఈనెల 12న <<17649043>>Way2News కాన్‌క్లేవ్<<>> జరగనుంది. ఈ సదస్సుకు వైసీపీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చే పదేళ్లకు గాను తమ ఆలోచనలు పంచుకోనున్నారు. దేశంలో డిజిటల్ మీడియా సంస్థ నిర్వహిస్తున్న తొలి కాన్‌క్లేవ్ ఇదే.

Similar News

News September 10, 2025

హైకోర్టు తీర్పును సవాల్ చేసే యోచనలో TGPSC?

image

TG: గ్రూప్-1 మెయిన్స్ ఆన్సర్ షీట్లను రీవాల్యుయేషన్ చేయాలని హైకోర్టు ఇచ్చిన <<17655670>>తీర్పును<<>> డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయాలని TGPSC యోచిస్తున్నట్లు సమాచారం. నిన్న కమిషన్ ఛైర్మన్ బుర్ర వెంకటేశం, సభ్యులు దీనిపై సమావేశమై చర్చించారు. మళ్లీ మూల్యాంకనం జరిపితే అనేక సమస్యలు వస్తాయని కమిషన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వ పెద్దలతోనూ చర్చించి ఇవాళ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

News September 10, 2025

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు: APSDMA

image

AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి, ఏలూరు, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వానలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, తీరం వెంబడి గంటకు 40 -60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.

News September 10, 2025

మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా: ట్రంప్

image

భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ వెల్లడించారు. ‘వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి ఇరు దేశాలు చర్చలు కొనసాగిస్తున్నాయి. రాబోయే వారాల్లో నా మంచి మిత్రుడు, ప్రధాన మంత్రి మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా. ట్రేడ్ విషయంలో రెండు గొప్ప దేశాలు సక్సెస్‌ఫుల్ కన్‌క్లూజన్‌కు రావడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నా’ అని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.