News April 4, 2024
ఎనిమిది సినిమాలకు సీక్వెల్స్!

బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నటించిన ‘మైదాన్’ చిత్రం ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా దీని తర్వాత ఆయన నటించే సినిమాలన్నీ సీక్వెల్స్ కావడం గమనార్హం. ఏకంగా ఎనిమిది సీక్వెల్ మూవీలను ఆయన లైన్‌లో పెట్టారు. సన్ ఆఫ్ సర్దార్‌కు మూవీకి కొనసాగింపుగా మరో మూవీ, రైడ్2, సింగం అగైన్, ఢమాల్-4, గోల్‌మాల్-5, దే దే ప్యార్ దే-2, దృశ్యం-3, షైతాన్-2 చిత్రాలు వన్ బై వన్ పట్టాలెక్కనున్నాయి.
Similar News
News March 25, 2026
ఇందిర అంటే గౌరవమే.. తప్పేమీ మాట్లాడలేదు: రాకేశ్ రెడ్డి

TG: అసెంబ్లీలో ఇందిరపై తన <<19474706>>వ్యాఖ్యల<<>> పట్ల దుమారం రేగడంపై బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి స్పందించారు. ‘ఇందిరా గాంధీ ఉక్కుమహిళ, ఆమె అంటే మాకు గౌరవమే. నేను తప్పేమీ మాట్లాడలేదు. అనేక పథకాలకు ఇందిరమ్మ పేరు పెట్టారు. ఇప్ప సారా తయారుచేస్తే ఆమె పేరు మాత్రం పెట్టొద్దనే చెప్పా. క్షమాపణ చెప్పాల్సి వస్తే చెప్తా. తమాషా చేయొద్దని మంత్రి నన్ను బెదిరిస్తున్నారా?’ అని అన్నారు.
News March 25, 2026
బెంగాల్ దంగల్: TMC పైకి BJP ‘పేస్’ అస్త్రం?

టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ త్వరలోనే బీజేపీలో చేరి, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. BJP జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్‌తో నిన్న ఆయన భేటీ కావడంతో ఈ చర్చ మొదలైంది. అసెంబ్లీ పోరులో అధికార TMCని ఢీకొడుతున్న BJP.. పేస్‌ను అస్త్రంగా మార్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా 2021లో TMCలో చేరిన పేస్ కొన్నాళ్ల నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు.
News March 25, 2026
వచ్చే 3 నెలలు అధిక ఎండలు, వడగాడ్పులు

AP: రాష్ట్రంలో 40-42 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, వచ్చే 3 నెలల్లో మరింత పెరిగే అవకాశం ఉందని Spl CS జయలక్ష్మి తెలిపారు. సాధారణం కన్నా 4-5.4 డిగ్రీల వరకు అధికంగా హీట్ పెరుగుతుందని సమీక్షలో చెప్పారు. ఎండలు, వడగాడ్పుల నుంచి ప్రజల రక్షణకు విపత్తుల నిర్వహణ సహా ఇతర శాఖలు చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధి పనులు ఉ.11 గంటల్లోపే ముగించాలని, తాగునీటికి సమస్య రాకుండా చూసుకోవాలని సూచించారు.


