News September 9, 2025

విద్యార్థి సమస్యలపై సంఘాల ప్రతినిధులు స్పందిస్తూ ఉండాలి: కలెక్టర్

image

అమలాపురం కలెక్టరేట్ భవన్‌లో మంగళవారం ఆర్‌ఎస్‌యూ స్టూడెంట్ యూనియన్ పదవ రాష్ట్ర మహాసభల గోడపత్రికలను కలెక్టర్ ఆర్ మహేశ్ కుమార్ విడుదల చేశారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కంటేపల్లి నరేంద్ర ఆధ్వర్యంలో పలు విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి సంఘాలు ఎప్పటికప్పుడు ముందుకు రావాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థి సంఘాలు సమాజ అభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు.

Similar News

News September 10, 2025

నేడు అద్దంకికి రానున్న APS-RTC MD

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకాతిరుమలరావు బుధవారం అద్దంకి ఆర్టీసీ డిపోను సందర్శించనున్నారు. ఈ విషయాన్ని అద్దంకి RTC డిపో మేనేజర్ బెల్లం రామ మోహన్‌రావు మంగళవారం తెలిపారు. RTC గ్యారేజీ, డిపో, బస్టాండ్ పరిసరాలను పరిశీలిస్తారన్నారు. ఆర్టీసీ అధికారులు అందుబాటులో ఉండాలని DM కోరారు.

News September 10, 2025

ఖమ్మం: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతులకు భవన నిర్మాణ కార్మిక(మేస్త్రి) పని, నర్సరీ మేనేజ్మెంట్, మొబైల్ రిపేరింగ్‌పై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. 30 రోజుల శిక్షణతో పాటు భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని తమ కార్యాలయంలో ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News September 10, 2025

4వేల ఎకరాలు గుర్తించండి: కలెక్టర్

image

రంపచోడవరం PMRC కార్యాలయంలో తహశీల్దార్‌లతో జిల్లా కలెక్టర్ మంగళవారం సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు వలన చింతూరు డివిజన్‌లో భూములు కోల్పోతున్న రైతులకు అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాల్లో భూములు అందజేయాలన్నారు. కేసుల్లో లేని, వివాదాలు లేని 4,000 ఎకరాలను గుర్తించి నివేదిక 15రోజుల్లో అందజేయాలని తహశీల్దార్‌లను ఆదేశించారు. సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్ ఉన్నారు.