News September 9, 2025
అనధికార శ్రీనివాస కళ్యాణాలు నిర్వహిస్తే చర్యలు: TTD

విదేశాలలో శ్రీనివాస కళ్యాణం పేరుతో అనధికార, నకిలీ కళ్యాణాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. UKలోని శ్రీ అద్వైత సేవా సమితి పేరుతో ఓ సంస్థ శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు ఆహ్వాన పత్రికను వాట్సాప్ గ్రూపులలో వైరల్ చేసింది. ఆ కార్యక్రమానికి టీటీడీ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
Similar News
News March 18, 2026
వనపర్తి: పన్నుల వసూళ్లలో వేగం పెంచాలి: కలెక్టర్

వనపర్తి జిల్లాలోని 5 మున్సిపాలిటీల పరిధిలో ఆస్తి, నీటి పన్ను బకాయిల వసూళ్లలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ తన కార్యాలయంలో జిల్లాలోని 5 మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పన్ను బకాయి ఉన్న వారి జాబితాను వార్డుల వారీగా సిద్ధం చేయాలని, ఈ జాబితాను సంబంధిత వార్డు కౌన్సిలర్లకు అందజేయాలని కలెక్టర్ సూచించారు.
News March 18, 2026
స్కానింగ్ సెంటర్లపై నిరంతర నిఘా ఉంచాలి: డీఎంహెచ్‌ఓ

జిల్లాలోని స్కానింగ్ సెంటర్లను ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా తనిఖీ చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ అధికారులను ఆదేశించారు. బుధవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో పిసిపిఎన్‌డిటి జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. స్కానింగ్ సెంటర్లలో ‘ఫారమ్-ఎఫ్’ను సక్రమంగా పూరించాలని, రిజిస్టర్లను పక్కాగా నిర్వహించాలని సూచించారు.
News March 18, 2026
ప్రాధాన్య రంగానికి రుణాల పంపిణీ పెంచాలి: కలెక్టర్

జిల్లాలో ప్రాధాన్యతా రంగాలకు రుణ మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ అంకిత్ బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో 2025 డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి జిల్లా సంప్రదింపుల (డీసీసీ), సమీక్ష కమిటీ (డీఎల్‌ఆర్‌సీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో బ్యాంకులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.


