News September 9, 2025
మునిపల్లి: గురుకుల పాఠశాలను పరిశీలించిన ఎస్పీ

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లిలోని గురుకుల పాఠశాలలో హాస్టల్ గోడ కూలిన ఘటనలో ముగ్గురు (3) విద్యార్థులు స్వల్ప గాయాల పాలైన ఘటనపై ఎస్పీ పారితోష్ పంకజ్ స్పందించారు. ఈ సందర్భంగా ఘటన స్థలాన్ని పరిశీలించి హాస్టల్ విద్యార్థులను తాత్కాలికంగా వేరే ప్రాంతానికి తరలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం గాయపడ్డ చిన్నారులను ఆసుపత్రిలో పరామర్శించారు.
Similar News
News March 11, 2026
కడప జిల్లాలో వంట గ్యాస్ కనెక్షన్లు ఎన్నంటే.!

కడప జిల్లాలో గృహ వినియోగ వంట గ్యాస్ కనెక్షన్లు సుమారు 5,99,802 ఉన్నాయి. ప్రభుత్వం వీటి రీఫిల్ ధరను రూ.60 పెంచింది. దీంతో జిల్లాలోని కుటుంబాలపై ఒక సిలిండర్ వినియోగానికి రూ.3.59 కోట్లు అదనపు భారం పడింది. జిల్లాలో వాణిజ్య వంట గ్యాస్ కనెక్షన్లు 4,769 ఉన్నాయి. వీటిపై రీఫిల్ ధరను రూ.144 పెంచారు. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు మినహా చిన్న హోటళ్లు, పానిపూరీ, టీ స్టాళ్లలో డొమస్టిక్ గ్యాస్ వాడుతున్నారు.
News March 11, 2026
KNR: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న లక్కీ డ్రా..!

KNR(D) ఇల్లందకుంట మండలంలో లక్కీ డ్రా పేరిట సాగుతున్న ప్రచారం కలకలం రేపుతోంది. రూ.3500 టికెట్‌తో రూ.90 లక్షల విలువైన ఇల్లు, నగదు బహుమతులు ఇస్తామంటూ సోషల్ మీడియాలో ఊరిస్తున్నారు. అయితే, ఈ భారీ స్కీమ్‌కు ప్రభుత్వ అనుమతి ఉందా? లేక అధికారుల అండదండలతో సాగుతోందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మనీ ల్యాండరింగ్‌కు ఆస్కారమున్న ఇలాంటి వ్యవహారాలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
News March 11, 2026
భద్రాచలం: మావోయిస్టులు.. పోలీసులకు మధ్య కాల్పులు

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పార్థాపూర్ ప్రాంతంలో బుధవారం భద్రతా బలగాలు, మావోయిస్ట్‌ల మధ్య భీకర ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్ట్‌లు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఎన్‌కౌంటర్ జరిగిన విషయాన్ని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ నిఖిల్ రఖేచా ధ్రువీకరించారు. ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు సమచారం.


