News April 4, 2024
నేడు 130 మండలాల్లో తీవ్ర వడగాలులు
AP: రాష్ట్రంలోని 130 మండలాల్లో ఈరోజు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం జిల్లాలో 4, విజయనగరం 19, పార్వతీపురం మన్యం 12, అల్లూరి సీతారామరాజు 4, అనకాపల్లి 13, కాకినాడ 9, కృష్ణా 1, NTR 14, తూ.గో 3, గుంటూరు 5, పల్నాడు 6, నంద్యాల 19, అనంతపురం 1, కడప జిల్లాలో 20 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Similar News
News November 13, 2024
TODAY HEADLINES
☛ ఏపీలో రిలయన్స్ రూ.65వేల కోట్ల పెట్టుబడులు
☛ ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా RRR, చీఫ్ విప్‌గా ఆంజనేయులు
☛ ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా
☛ అమృత్ టెండర్లపై ఆరోపణలు అవాస్తవం: సీఎం రేవంత్
☛ రేవంత్, పొంగులేటి పదవులు పోవడం ఖాయం: KTR
☛ వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో 16 మందికి రిమాండ్
☛ కర్ణాటక ప్రజల్ని కాంగ్రెస్ లూటీ చేస్తోంది: ప్రధాని మోదీ
News November 13, 2024
డిసెంబర్లో ‘స్పిరిట్’ స్టార్ట్.. 2026లో రిలీజ్: నిర్మాత
రెబల్ స్టార్ ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న ‘స్పిరిట్’ మూవీపై నిర్మాత భూషన్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ఈ మూవీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. స్క్రిప్ట్ పూర్తిచేసేందుకు సందీప్ శ్రమిస్తున్నారు. డిసెంబర్లో ముహూర్తపు షాట్ తీసి 2025 జనవరి నుంచి షూట్ వేగంగా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. 2026 మధ్యలో మూవీ విడుదలవుతుంది’ అని తెలిపారు.
News November 13, 2024
BREAKING: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
TG: పెద్దపల్లి-రాఘవాపూర్ దగ్గర ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఓవర్ లోడ్ కారణంగా 6 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు.