News September 9, 2025
జంగారెడ్డిగూడెం: ఆగస్ట్ వరకు 117 కేసులు.. 113 మంది అరెస్ట్

జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ సర్కిల్‌లో నిరంతర దాడులు నిర్వహిస్తున్నట్లు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనుబాబు మంగళవారం తెలిపారు. జనవరి నుంచి ఆగస్ట్ వరకు నాటు సారా కేసులు 29, బెల్లం ఊట 12, అనధికార మద్యం అమ్మకాలపై 42 కేసులు నమోదు చేశామన్నారు. 113 మందిని అరెస్ట్ చేసి 4 వాహనాలను సీజ్ చేసినట్లు వివరించారు. ప్రజలు ఎక్సైజ్ నేరాలకు సంబంధించిన సమాచారం అందించాలని కోరారు. వారి సమాచారం గోప్యంగా ఉంచుతామన్నారు.
Similar News
News March 7, 2026
విశాఖ: పన్నులు చెల్లించకుంటే జప్తే

ఆర్థిక సంవత్సరం ముగుస్తుండగా జీవీఎంసీ అధికారులు పన్నుల వసూళ్లపై దృష్టి సారించారు. రూ.650 కోట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు మొండి బకాయిదారులపై చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే 1,36,149 మంది బకాయిదారులను గుర్తించి, 1,10,136 మందికి జప్తు నోటీసులు జారీ చేశారు. నీటి పన్ను చెల్లించని 62,290 మందికి కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం రూ.458.9 కోట్లు వసూలు కాగా, రూ.188.20 కోట్లు రావాల్సి ఉంది.
News March 7, 2026
సర్కారు బడి పిల్లలకు గుడ్ న్యూస్.. వారానికో రోజు ఫిష్!

TG: ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన పథకంలో కీలక మార్పులు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు మరింత పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రస్తుతం ఇస్తున్న చికెన్ స్థానంలో వారానికి ఒకరోజు చేపలను చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. 99 రోజుల ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈ కొత్త మెనూ అమలు చేసే అవకాశం ఉంది. ఒక వారం చికెన్, మరో వారం చేపలు అందించేలా ప్రత్యామ్నాయ మార్గాలనూ అధికారులు పరిశీలిస్తున్నారు.
News March 7, 2026
కడప: పరీక్షకు 90% విద్యార్థులు హాజరు

కడప జిల్లాలోని 62 కేంద్రాల్లో శనివారం ఇంటర్ పస్ట్ ఇయర్ ఎకనామిక్స్ పరీక్షలు నిర్వహించారు. 90% విద్యార్థులు హాజరయ్యారు. 5,130 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 4,600 మంది రాశారు. 530 మంది అబ్సెంట్ అయ్యారు. జనరల్ విద్యార్థుల్లో 4,013 మందికి 3,658 మంది పరీక్షలు రాశారు. 355 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,117 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా.. 942 మంది రాశారు.


