News September 9, 2025

సూర్యాపేటలో క్యాన్సర్ చికిత్స వార్డు ప్రారంభం

image

సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్స వార్డును మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ ప్రారంభించారు. జిల్లాలో క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి త్వరగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ వార్డును ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. ఇకపై చికిత్స కోసం హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లకుండా ఇక్కడే ఉచితంగా వైద్యం, మందులు పొందవచ్చని సూచించారు.

Similar News

News September 10, 2025

జగిత్యాల: ఇక భూములకు ప్రత్యేక భూధార్‌ కార్డులు

image

ప్రతి వ్యక్తికి జారీ చేసిన ఆధార్ కార్డు లాగ, ఇక ప్రతి భూమికి భూధార్ కార్డును జారీ చేయనున్నారు. దీని ఆధారంగా భూమి సర్వే నంబర్లు, విస్తీర్ణం, సరిహద్దులు, ఏ విధంగా సంక్రమించింది, బీమా, బ్యాంకు రుణాల వంటి వివరాలను ఇందులో నమోదు చేయనున్నారు. దీంతో నకిలీ డాక్యుమెంట్ల, ఒకే భూమిని పలువురికి రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు. జగిత్యాల జిల్లాలో మెత్తం 2,48,550 మంది రైతులు ఉండగా, 4,18,569 ఎకరాల సాగుభూమి ఉంది.

News September 10, 2025

మెట్‌పల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

JGTL(D) మెట్‌పల్లి శివారులోని వేంపేట్ రోడ్డులోని BC హాస్టల్ ముందు మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో టాటా ACE, ద్విచక్రవాహనం ఢీకొనగా వ్యక్తి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడిని వేంపేట్ గ్రామానికి చెందిన మగ్గిడి నర్సయ్యగా గుర్తించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 10, 2025

ఖమ్మం: కేయూలో ఎల్ఎల్‌బీ పరీక్షలు వాయిదా

image

కాకతీయ యూనివర్సిటీ (కేయూ) పరిధిలో ఈ నెల 12న జరగాల్సిన ఎల్ఎల్‌బీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎల్ఎల్‌బీ మూడేళ్ల కోర్సు రెండో సెమిస్టర్ (మూడో పేపర్), ఐదేళ్ల లా కోర్సు ఆరో సెమిస్టర్ (మూడో పేపర్) పరీక్షలను వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్ తెలిపారు. వాయిదా వేసిన ఈ పరీక్షలు ఈనెల 15న జరుగుతాయని చెప్పారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.