News September 9, 2025

కృష్ణానదిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

image

కొల్లూరు మండలం పెసర్లంక సమీపంలోని అరవింద వారధి కృష్ణానదిలో గల్లంతైన యువకుడి మృతదేహం మంగళవారం లభ్యమైనట్లు తహశీల్దార్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. చింతల్లంక గ్రామానికి చెందిన తోడేటి హర్షవర్ధన్ (22) ఆదివారం రాత్రి కృష్ణానదిలో గల్లంతయ్యాడు. అతని మృతదేహం కృష్ణాజిల్లా నాగాయలంక మండలం కొత్తపాలెంలో లభ్యమైంది.

Similar News

News March 20, 2026

ఆసీస్ ప్లేయర్లు కావాలనే రావడం లేదా?

image

IPL ఆరంభ మ్యాచులకు కమిన్స్(SRH), స్టార్క్(DC), హేజిల్‌వుడ్(RCB) రావడం లేదు. ఎల్లిస్(CSK) సీజన్ మొత్తానికి దూరమయ్యారు. గాయాల భయంతో ఆస్ట్రేలియన్లు IPL ఆడేందుకు ఇష్టపడడం లేదని, కావాలనే మ్యాచులకు డుమ్మా కొడుతున్నట్లు కొందరు IND ఫ్యాన్స్ అంటున్నారు. ఫ్రాంచైజీల నుంచి రూ.కోట్లు తీసుకుంటూ స్వదేశం తరఫున ఆడేందుకే మొగ్గు చూపుతున్నారు. అలాంటప్పుడు వేలంలో పాల్గొనడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు?

News March 20, 2026

జగిత్యాల: జనగణన పకడ్బందీగా నిర్వహించాలి

image

జిల్లాలో జనగణన కార్యక్రమాన్ని అత్యంత ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, రాజా గౌడ్ అధికారులను ఆదేశించారు. జనగణన-2027లో భాగంగా మొదటి దశలో చేపట్టనున్న ‘హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సెస్’పై అధికారులకు నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శిక్షణలో నేర్చుకున్న ప్రతి అంశాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్నారు.

News March 20, 2026

కాంగ్రెస్‌ది చోర్ విధానం: హరీశ్ రావు

image

TG: కాంగ్రెస్ హయాంలో తలసరి ఆదాయం, GSDP తగ్గిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ‘కాంగ్రెస్‌ది క్యూర్, ప్యూర్, రేర్ విధానం కాదు.. చోర్ విధానం. 6 గ్యారంటీలు అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. BRS హయాంలో తలసరి ఆదాయ వృద్ధి 12.1% ఉంటే ఇప్పుడు 10.2%గా ఉంది. కాంగ్రెస్ వైఫల్యం వల్లే ఇది తగ్గింది. బడ్జెట్ ద్వారా ఈ ప్రభుత్వ చేతగానితనం అర్థమైంది’ అని ప్రెస్‌మీట్‌లో ఫైరయ్యారు.