News September 9, 2025
CPGETలో జగిత్యాల విద్యార్థినికి రాష్ట్రస్థాయి 4వ ర్యాంక్

జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థిని సయ్యద్ ఫలక్ CPGET– 2025(కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్)లో రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించింది. హిందీ విభాగానికి చెందిన ఈమె ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ హిందీ కోర్సులో ప్రవేశానికి అర్హత సాధించింది. ఈ సందర్భంగా ఆమెను ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ప్రమోద్ కుమార్, హిందీ విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ వాసాల వరప్రసాద్, తదితర అధ్యాపకులు అభినందించారు.
Similar News
News September 10, 2025
MBNR: రైతులు ALERT..కృషి విజ్ఞాన కేంద్రం కీలక సూచనలు

ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతు పొలాలలో వరి పంటలో ఆకులు చుట్టుకుని పోయి ఆకుల పైన తెల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయని పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు. తామర పురుగుల వల్ల ఏర్పడతాయని, వెంటనే వరిసాగు చేసే రైతులు ఫటేరా @4 కిలోలు ఎకరానికి లేదా/ క్లోరన్ త్రినిల్ ప్రోల్ @60 మి.లీ ఎకరానికి లేదా/ ఫిప్రోనిల్ @400 మిల్లీలీటర్లు ఎకరానికిలో పిచికారి చేస్తే దీని ఉద్ధృతి తగ్గుతుందన్నారు.
News September 10, 2025
నక్కపల్లి స్టీల్ ప్లాంట్ ఏపీకి గర్వకారణం: శ్రీనివాసవర్మ

నక్కపల్లిలో ఏర్పాటు చేయబోయే ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏపీకి గర్వకారణంగా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి బి.శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో మంత్రి కార్యాలయంలో మాట్లాడుతూ.. 17.8 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో దీనిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. మొదటి దశలో 7.3 మిలియన్ టన్నులు, రెండవ దశలో 10.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో పూర్తి చేస్తామన్నారు.
News September 10, 2025
JGTL జిల్లా విద్యుత్ శాఖ ఇంజినీర్స్ కార్యవర్గం ఏకగ్రీవం

JGTL జిల్లా TG పవర్ డిప్లోమా ఇంజినీర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లాధ్యక్షుడిగా బీ.సుందర్, అడ్వైజర్‌గా యం.సదశివారెడ్డి, కార్యదర్శిగా పి.వరుణ్ కుమార్, కోశాధికారిగా ఎం.శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎల్.రాజు, ఆఫీసు సెక్రటరీగా ఎస్.రంజిత్, లేడీ రెప్రజెంటేటివ్‌గా ఎస్.మౌనిక ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో కంపెనీ జనరల్ సెక్రటరీ సుబ్రహ్మణేశ్వరరావు పాల్గొన్నారు.