News April 4, 2024

బాక్సర్ల విదేశీ శిక్షణకు క్రీడా శాఖ ఆమోదం

image

పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ విదేశాల్లో శిక్షణ తీసుకోనున్నారు. ఆమెతో పాటు ప్రీతి, పర్వీన్, లవ్లీనా కూడా టర్కీలో ట్రైనింగ్ పొందనున్నారు. వీరి శిక్షణకు అయ్యే మొత్తం ఖర్చును భరిస్తామని కేంద్ర క్రీడా శాఖ తెలిపింది. అలాగే అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనేందుకు గాను భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బత్రాకు అయ్యే ఖర్చులను కూడా చెల్లిస్తామని పేర్కొంది.

Similar News

News March 24, 2026

రన్‌టైమ్‌తో పనేంటి.. కథ బాగుంటే హిట్టే!

image

సినిమా సక్సెస్‌కు నిడివి ముఖ్యం కాదని, ప్రేక్షకులను కట్టిపడేసే కథే ప్రధానమని యానిమల్(3:24H), పుష్ప-2(3:21), ధురంధర్ 1&2(3:40& 3:51) చిత్రాలు నిరూపించాయి. బలమైన కథతో వస్తే జనాలు బ్రహ్మరథం పడతారని ఇవి స్పష్టం చేశాయి. రొటీన్ ఫార్ములాలు కాకుండా ఎమోషన్స్, ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లేతో వస్తే రన్‌టైమ్ అడ్డంకి కాదని తేలిపోయింది. కంటెంట్ బాగుంటే ఆడియన్స్‌ ఎన్ని గంటలైనా కూర్చుంటారనడానికి వీటి వసూళ్లే సాక్ష్యం.

News March 24, 2026

యువతా.. దేశ రాజకీయం మార్చేందుకు సిద్ధమా?

image

రాజకీయాలపై ఆసక్తి ఉన్న యువత, మహిళలకు గోల్డెన్ ఛాన్స్. నియోజకవర్గాల పునర్విభజనతో దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు <<19460921>>భారీగా<<>> పెరగనున్నాయి. దీంతో విస్తృత అవకాశాలు రానున్నాయి. దేశ దిశను మార్చాలనే సంకల్పం ఉన్నవారు ప్రజాక్షేత్రంలోకి దిగండి. కొత్త ఆలోచనలు, సరికొత్త భావజాలాలను ప్రజలకు పరిచయం చేసి వారి మెప్పు పొందండి. ‘నేపాల్‌’ను గెలిచిన Gen Z స్ఫూర్తితో ముందుకు కదలండి.

News March 24, 2026

విజయవాడలో ఉగ్రమూలాలు.. ముగ్గురు అరెస్ట్

image

AP: ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో విజయవాడలో ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. మొహ్మద్‌ రహమతుల్లా షరీఫ్, మీర్జా సొహైల్‌ బేగ్, మొహ్మద్‌ డానిష్‌ అనే ఈ నిందితులు సోషల్ మీడియా ద్వారా యువతను తీవ్రవాద భావజాలంవైపు ఆకర్షిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరితో పాటు పది మంది దేశవ్యాప్తంగా ఈ నెట్‌వర్క్‌ నడిపిస్తున్నారని.. వీరికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.