News September 9, 2025
ఆకివీడు: మహిళపై దాడికి దిగిన వ్యక్తిపై కేసు నమోదు

ఆటోలో ప్రయాణిస్తున్న మహిళపై దాడికి దిగి చంపేస్తానని బెదిరించిన వ్యక్తిపై ఆకివీడు పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని సిద్దాపురం గ్రామానికి చెందిన సువ్వారి రంగమ్మ మరో ముగ్గురితో కలిసి ఆటోలో వస్తుండగా అదే ఆటోలో ప్రయాణిస్తున్న సింగపర్తి కొండ దౌర్జన్యం చేసి చంపుతానని బెదిరించినట్లు ఆకివీడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. హెడ్ కానిస్టేబుల్ జే నాగేశ్వరరావు కేసు నమోదు చేసినట్లు వివరించారు.
Similar News
News April 1, 2026
ఆచంటలో ముత్యాలమ్మ ఆలయాన్ని సందర్శించిన కలెక్టర్

ఆచంటలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ పరిసరాలను కలెక్టరు నాగరాణి, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ బుధవారం పరిశీలించారు. ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, సమీపంలో ఏర్పాటు చేయబోయే పార్కు, వాకింగ్ ట్రాక్ ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఆచంట ప్రజలకు ఆధునిక పార్కు అందుబాటులోకి రానుందని వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
News April 1, 2026
మద్యం విక్రయాల్లో ప.గో. జిల్లాకు 6వ స్థానం

మద్యం విక్రయాల్లో రాష్ట్రంలోనే ప.గో. జిల్లా 6వ స్థానంలో నిలిచింది. విశాఖ టాప్‌లో ఉంది. 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు రూ.1989.97కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయినట్లు అధికారులు తెలిపారు. మద్యం బాక్సులు 17.24లక్షలు, బీర్ బాక్సులు 6.34లక్షలు ఉన్నాయి. 2024-25లో రూ.1455.0.8కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా..2025-26లో దీనిపై 2శాతం తగ్గాయి. 2024-25తో పోలిస్తే 2025-26లో 55శాతం బీర్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి.