News September 9, 2025
జ్ఞానపురంలో అర్ధరాత్రి హల్చల్.. ఇంటి యజమానిపై దాడి

జ్ఞానపురంలో సోమవారం రాత్రి ఇద్దరు యువకులు హల్చల్ చేశారు. ముగ్గురు మహిళలు ఉంటున్న ఇంటి తలుపులు, కిటికీలు కొట్టడంతో వారు ఇంటి యజమానికి ఫోన్ చేశారు. ఇంటి ఓనర్ పీలా శ్రీనివాసరావు (55), తన కుమారుడు పూర్ణ సాయితో వెళ్లి ప్రశ్నించగా దాడికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టినట్లు కంచరపాలెం CI రవి కుమార్ మంగళవారం తెలిపారు. నిందుతులు పాత నేరస్తులైన దేవర కళ్యాణ్, దుర్గా ప్రసాద్‌గా గురించారు.
Similar News
News March 13, 2026
విశాఖ పోలీసులను అభినందించిన సీఎం

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సైబర్ నేరాలపై విశాఖ పోలీసులు రూపొందించిన 24 షార్ట్ ఫిలింలను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. రాష్ట్రంలో సైబర్ మోసాలతో రూ.వేల కోట్ల నష్టం జరుగుతున్న నేపథ్యంలో అవగాహన పెంచేందుకు వీటిని రూపొందించినట్లు విశాఖ సీపీ బాగ్చీ వివరించారు. ఈ కృషికి పోలీసులను సీఎం అభినందించారు.
News March 12, 2026
మధురవాడ: ఉరివేసుకుని యువకుడు మృతి!

మధురవాడ గణేష్ నగర్‌లో తాడి ప్రవీణ్ కుమార్ (27) అనే యువకుడు మనస్థాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చింతపల్లికి చెందిన ప్రవీణ్ గత ఆరేళ్లుగా ఓ మహిళతో సహజీవనం చేస్తూ, స్థానిక టెలిఫోన్ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 12, 2026
విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. చర్లపల్లికి కొత్త సూపర్ ఫాస్ట్ రైలు!

రైల్వే ఆధునీకరణలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు. కొక్రాఝర్ – చర్లపల్లి (05674) స్పెషల్ రైలు శనివారం సాయంత్రం పెందుర్తి (17:58), దువ్వాడ (19:30) స్టేషన్లకు చేరుకుంటుంది. 20 కోచ్‌లతో నడిచే ఈ అత్యాధునిక రైలు సామాన్య ప్రయాణికులకు హైదరాబాద్ వెళ్లేందుకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుంది


