News September 9, 2025
పన్ను వసూళ్లకు GHMCకు కొత్త టెక్నిక్!

GHMC తన ఆస్తి పన్ను ఆదాయాన్ని పెంచేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. TGSPDCL సహకారంతో ఆస్తి పన్ను ఐడీ నంబర్లను (PTIN) విద్యుత్ కనెక్షన్లతో (USC) అనుసంధానం చేస్తోంది. ఈ ప్రాజెక్టు ఇప్పటికే 6 GHMCలోని జోన్లలో గణనీయమైన పురోగతి సాధించింది. 96,938 నివాస ఆస్తుల పన్ను ఐడీలు విజయవంతంగా వాణిజ్య విద్యుత్ కనెక్షన్లతో అనుసంధానం అయ్యాయని అదనపు కమిషనర్ అనురాగ్ జయంతి తెలిపారు.
Similar News
News March 14, 2026
OTD: క్రికెట్ చరిత్రలో మర్చిపోలేని రోజు

ఇండియన్ క్రికెట్ చరిత్రలో అద్భుతం జరిగి నేటికి సరిగ్గా 25 ఏళ్లు. 2001 కోల్‌కతా టెస్టులో టీమ్ ఇండియా ఫాలో-ఆన్ ఆడుతూనే ఆస్ట్రేలియాను ఓడించి రికార్డు సృష్టించింది. VVS లక్ష్మణ్ (281), రాహుల్ ద్రవిడ్ (180) నాలుగో రోజంతా వికెట్ పడకుండా పోరాడి భారత్‌కు 171 పరుగుల చరిత్రాత్మక విజయాన్ని అందించారు. దీంతో టెస్టుల్లో వరుసగా 16 విజయాలతో దూకుడు మీదున్న ఆసీస్‌కు బ్రేక్ వేశారు.
News March 14, 2026
కడియం కావ్య వినతికి కేంద్రం స్పందన

తెలంగాణలో ధాన్యం, పత్తి రవాణాకు అవసరమైన రైల్వే రేక్స్ కేటాయించాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య చేసిన వినతికి కేంద్రం స్పందించింది. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రావనీత్ సింగ్ బిట్టు లేఖ ద్వారా రేక్స్ సమృద్ధిగా కేటాయిస్తామని తెలిపారు. రాష్ట్ర అవసరాలు, బోగీల లభ్యత ఆధారంగా ధాన్యం రవాణా కొనసాగుతుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో సుమారు 3.59 మిలియన్ టన్నుల ధాన్యం రైల్వే ద్వారా రవాణా కానుందన్నారు.
News March 14, 2026
HYD: ఓల్డ్ సిటీ ఇక ‘హైటెక్’ గుమ్మం!

ట్రాఫిక్ సమస్యతో విసిగిపోయిన టోలిచౌకీ వాసులకు త్వరలో కొత్త అనుభూతి పలకరించనుంది. టూంబ్స్ నుంచి బంజారా దర్వాజా వరకు రోడ్డు మధ్యలో పచ్చని మీడియన్లు, ఫ్లైఓవర్ కింద అందమైన జంక్షన్లతో ఈ ప్రాంతం సరికొత్తగా ముస్తాబవుతోంది. సుమారు రూ.3.05 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ పనులు ప్రయాణికులకు కంటికి ఇంపుగా, మనసుకు హాయినివ్వనున్నాయి. భాగ్యనగర వైభవం మీ గుమ్మం ముందుకు రాబోతోంది.


