News September 9, 2025

సన్నబియ్యం సరఫరా సాఫీగా జరగాలి: కలెక్టర్

image

సన్నబియ్యం సరఫరా సాఫీగా జరగాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని రేషన్ షాపులను ఆకస్మికంగా సందర్శించి బియ్యం సరఫరా, నాణ్యతపై సమీక్షించారు. కొత్త రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందించాలన్నారు. ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా డీలర్లు సమయపాలన పాటించాలని, విరుద్ధంగా వ్యవహరించనున్నారని తక్షణమే సస్పెండ్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News March 13, 2026

అమెరికాకు చిల్లు.. రష్యాకు కాసుల పంట

image

ఇరాన్‌పై యుద్ధంతో అమెరికా జేబుకు చిల్లు పడితే రష్యా మాత్రం దీనిని క్యాష్ చేసుకుంటోంది. చమురుకు డిమాండ్ పెరగడంతో ఆదాయంలో ఆ దేశానికి రోజుకు అదనంగా 150 మిలియన్ డాలర్లు (₹1,300 కోట్లు) వస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి నెలాఖరుకు ఈ సంక్షోభం వల్ల రష్యాకు అదనంగా $5 బిలియన్లు (₹46వేల కోట్లు) రెవెన్యూ వస్తుందని అంచనా. మరోవైపు US ఇరాన్‌పై భారీగా ఖర్చు చేస్తోంది. వారంలోనే 6 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది.

News March 13, 2026

పాలమూరు: ఏడాదికి 8 నెలలు నీటిలోనే ఆలయం

image

కొల్లాపూర్(M) సోమశిల కృష్ణానది తీరంలో గల ప్రాచీన సంగమేశ్వర ఆలయ గోపురం భక్తులకు దర్శనమిస్తోంది. ఏడాదిలో సుమారు 8 నెలల పాటు కృష్ణమ్మ ఒడిలో జలధివాసంలో ఉండే ఈ ఆలయం, వరద తగ్గుముఖం పట్టడంతో బయటపడుతోంది. గర్భగుడిలో బురద మట్టి పేరుకుపోయినప్పటికీ వేపధార శివలింగం అలల తాకిడికి చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. ఉగాదిలోపు మొత్తం గుడి పూర్తిగా జలాధివాసం నుంచి బయటికి వచ్చే అవకాశం ఉంటుందని భక్తులు భావిస్తున్నారు.

News March 13, 2026

భూసంస్కరణలకు నాంది పలికింది ‘మన పాలుమూరు బిడ్డే’

image

బూర్గుల రామకృష్ణారావు ఉమ్మడి పాలమూరు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం పడకల్‌లో 1899 మార్చి 13న జన్మించారు. స్వాతంత్య్ర సమరయోధుడైన ఆయన తెలంగాణ చరిత్రలో ఓ మహోన్నత వ్యక్తి. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నిక తర్వాత, హైదారాబాద్ రాష్ట్రానికి(అప్పట్లో తెలంగాణ, మరాఠ్వా, కర్ణాటక ప్రాంతాలు కలిపి) ఆయన CMగా ఎన్నికయ్యారు. ఆయన హాయాంలో తీసుకువచ్చిన కౌలుదారీ చట్టం ద్వారా భూసంస్కరణలకు నాంది పలికారు. నేడు ఆయన జయంతి.