News September 9, 2025
కొత్తగూడ: విద్యార్థులకు స్పోర్ట్స్ మీట్ ఈవెంట్

రాష్ట్రంలోని 23 ఏకలవ్య పాఠశాలల విద్యార్థులతో స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం నిర్వహించడానికి కొత్తగూడ మండలం పోగుళ్లపల్లి ఏకలవ్య పాఠశాల వేదిక కానుంది. ఈనెల 11 నుంచి 13 వరకు జరగనున్న ఈ స్పోర్ట్స్ మీట్ ప్రారంభించడానికి మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్, ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్, ప్రిన్సిపల్ సెక్రటరీ సీతామహాలక్ష్మి, ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రాలు ముఖ్య అతిథులుగా పాల్గొనున్నారు.
Similar News
News September 10, 2025
భద్రాద్రి: నేడు, రేపు ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలకు సెలవు

దమ్మపేట మండలంలోని అప్పారావుపేట, అశ్వారావుపేటలో గల రెండు ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలకు వరుసగా రెండు రోజులు పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు ఫ్యాక్టరీ మేనేజర్ కళ్యాణ్ తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వారం రోజులు ఫ్యాక్టరీలకు ఆయిల్‌పామ్ గెలలు అధికంగా వచ్చాయని అన్నారు. ఈ కారణంగా బుధవారం, గురువారం గెలలు కొనబోమని పేర్కొన్నారు. తిరిగి శుక్రవారం నుంచి గెలలు యథావిధిగా కొంటామని, రైతులు సహకరించాలని కోరారు.
News September 10, 2025
ఆనాటి హాస్యనటుడు పి.ఎల్. నారాయణ మన బాపట్ల వాసే

విలక్షణమైన నటుడు, రచయిత, నాటక ప్రయోక్త పి.ఎల్. నారాయణగా పేరుపొందిన పుదుక్కోటై లక్ష్మీనారాయణ (సెప్టెంబర్ 10, 1935 – నవంబరు 3, 1998) ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు. ఈయన ఎక్కువగా సహాయ పాత్రలు, హాస్య ప్రధానమైన పాత్రలు పోషించారు. 1992లో యజ్ఞం సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయనటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. కుక్క, నేటి భారతం, మయూరి, రేపటి పౌరులు సినిమాలకు నంది అవార్డు అందుకున్నారు.
News September 10, 2025
ప్రపంచ ప్రఖ్యాతి రసాయన శాస్త్రవేత్త మన నాయుడమ్మ

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రసాయన శాస్త్రవేత్త యలవర్తి నాయుడమ్మ (SEP 10, 1922 – జూన్ 23, 1985) గుంటూరు జిల్లా యలవర్రులో జన్మించారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి పెరిగి శాస్త్ర సాంకేతిక రంగంలో ఉన్నత శిఖరాలను చేరుకొని దేశ ఖ్యాతిని పెంచిన ప్రొఫెసర్ నాయుడమ్మ పలు ప్రతిష్ఠాత్మక హోదాలను అందుకున్నారు. భారత శాస్త్ర సాంకేతిక పరిశోధనా సంస్థకు డైరెక్టర్‌గా పనిచేశారు.1971లో పద్మశ్రీ వరించింది. నేడు ఆయన జయంతి.