News September 9, 2025
చింతూరు: రెండు బైకులు ఢీ.. యువకుడి స్పాట్ డెత్

చింతూరు మండలం చట్టి గ్రామం సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఎదురెదురుగా ప్రయాణిస్తున్న రెండు బైక్స్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని ఎస్ఐ రాజేశ్ తెలిపారు. బైక్‌పై ప్రయాణం చేస్తున్న వ్యక్తి రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడి మృతి చెందాడన్నారు. అతని వద్ద ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ కార్డులో ఉన్న వివరాలు జోగా సెల్వం, పందిగూడ గ్రామం, ఛత్తీస్‌గఢ్ అని ఉందని వెల్లడించారు.
Similar News
News March 13, 2026
వార్ ఎఫెక్ట్.. కేంద్రానికి భారంగా ఫర్టిలైజర్ సబ్సిడీ!

ఇరాన్ యుద్ధంతో చమురు ధరలు పెరగడం, సరఫరాలో అంతరాయాల కారణంగా ఎరువుల సబ్సిడీ ఖర్చు కేంద్రానికి భారంగా మారనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఈ సబ్సిడీల బడ్జెట్ అంచనా ₹1.7లక్షల కోట్లు కాగా ఇప్పుడది ₹2.2 లక్షల కోట్లకు చేరొచ్చని కేంద్రవర్గాల సమాచారం. కాగా వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం ₹1.71లక్షల కోట్లలో ఫర్టిలైజర్ సబ్సిడీకి ₹1.16లక్షల కోట్లు, నాన్-యూరియా ఫర్టిలైజర్స్‌కు ₹54వేల కోట్లను కేంద్రం కేటాయించింది.
News March 13, 2026
హార్ముజ్‌లో నౌకలకు రక్షణ ఇవ్వలేం.. చేతులెత్తేసిన అమెరికా!

హార్ముజ్ జలసంధిని దాటుకొని నౌకలు <<19338961>>ధైర్యంగా వెళ్లాలని<<>> చెప్పిన అమెరికా ఇప్పుడు చేతులెత్తేసింది. ‘హార్ముజ్ నుంచి వెళ్లే నౌకలకు రక్షణ కల్పించలేం. ప్రస్తుతానికి మేం రెడీగా లేము. ఇరాన్‌పై దాడులు చేయడంపైనే మా సైన్యం దృష్టి ఉంది. ఈ నెలాఖరుకు ఎస్కార్ట్ కల్పించే ఛాన్స్ ఉంది’ అని US ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్ చెప్పారు. ఇవాళ US షిప్‌పై ఇరాన్ <<19364482>>దాడి చేయడం<<>> తెలిసిందే.
News March 13, 2026
వేములవాడలో కార్పెంటర్ ఆత్మహత్య

చందుర్తి మండలానికి చెందిన రాజూరి వీరాచారి (45) అనే కార్పెంటర్ గురువారం వేములవాడ శివారులోని కోనాయిపల్లెలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొన్నేళ్లుగా వేములవాడలో నివాసం ఉంటున్న ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.


