News September 9, 2025

ఆసిఫాబాద్ జిల్లాలో 19 రోడ్డు ప్రమాదాలు: ఎస్పీ

image

ఆసిఫాబాద్ జిల్లాలో ఈ సంవత్సరం 19 రోడ్డు ప్రమాదాలు జరిగాయని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడిపిన 3,124 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News September 10, 2025

1,543 ఇంజినీరింగ్ పోస్టులు

image

<>పవర్‌గ్రిడ్<<>> కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 1,543 పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్‌లో 55% మార్కులతో పాసైన, పని అనుభవం గల అభ్యర్థులు సెప్టెంబర్ 17వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 29ఏళ్లు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు. అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్:https://www.powergrid.in/

News September 10, 2025

గాజువాక: మేడ మీద నుంచి దూకి వివాహిత ఆత్మహత్య

image

మానసిక అనారోగ్య కారణాలతో వివాహిత భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వడ్లపూడికి చెందిన ప్రత్యూషకు రాంబిల్లికి చెందిన సతీశ్‌తో వివాహం కాగా కూర్మన్నపాలెంలోని అద్దెకి ఉంటున్నారు. మానసిక ఒత్తిడి, నిద్రలేమితో బాధపడుతున్న ఆమె ఆత్మహత్య చేసుకుందని దువ్వాడ సిఐ మల్లేశ్వరరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 10, 2025

ఫేక్ వీడియోలపై ఈ నెంబర్‌కి ఫిర్యాదు చేయండి: ఆకే. రవికృష్ణ

image

సీఎం చంద్రబాబు రైతులకు యూరియా, పురుగుమందుల అధిక వినియోగం తగ్గించాలన్న సూచనలను వక్రీకరించి డీప్‌ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో ‘CBN warning to farmers’ పేరుతో వస్తున్న ఫేక్ వీడియోపై CID కేసు నమోదు. సైబర్ క్రైమ్స్ ఐజీ ఆకే. రవికృష్ణ మాట్లాడుతూ.. ఫేక్ వీడియోలు సృష్టించడం, ఫేక్ న్యూస్ ఫార్వార్డ్ చేయడం నేరమేనని, అలాంటి వీడియోలపై 1930కు సమాచారం ఇవ్వాలన్నారు.