News September 9, 2025

రెబ్బన నుంచి బెల్లంపల్లికి అక్రమంగా ఇసుక రవాణా

image

ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను మైనింగ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు రామ్ నరేశ్, సురేశ్ తెలిపిన వివరాలు.. రెబ్బన నుంచి బెల్లంపల్లికి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారం మేరకు కన్నాల జాతీయ రహదారిపై ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Similar News

News September 10, 2025

గాజువాక: మేడ మీద నుంచి దూకి వివాహిత ఆత్మహత్య

image

మానసిక అనారోగ్య కారణాలతో వివాహిత భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వడ్లపూడికి చెందిన ప్రత్యూషకు రాంబిల్లికి చెందిన సతీశ్‌తో వివాహం కాగా కూర్మన్నపాలెంలోని అద్దెకి ఉంటున్నారు. మానసిక ఒత్తిడి, నిద్రలేమితో బాధపడుతున్న ఆమె ఆత్మహత్య చేసుకుందని దువ్వాడ సిఐ మల్లేశ్వరరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 10, 2025

ఫేక్ వీడియోలపై ఈ నెంబర్‌కి ఫిర్యాదు చేయండి: ఆకే. రవికృష్ణ

image

సీఎం చంద్రబాబు రైతులకు యూరియా, పురుగుమందుల అధిక వినియోగం తగ్గించాలన్న సూచనలను వక్రీకరించి డీప్‌ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో ‘CBN warning to farmers’ పేరుతో వస్తున్న ఫేక్ వీడియోపై CID కేసు నమోదు. సైబర్ క్రైమ్స్ ఐజీ ఆకే. రవికృష్ణ మాట్లాడుతూ.. ఫేక్ వీడియోలు సృష్టించడం, ఫేక్ న్యూస్ ఫార్వార్డ్ చేయడం నేరమేనని, అలాంటి వీడియోలపై 1930కు సమాచారం ఇవ్వాలన్నారు.

News September 10, 2025

ఏలూరు జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు

image

ఏలూరు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్లు, బస్సులను తనిఖీ చేశారు. మాదకద్రవ్యాల రవాణా, పేలుడు పదార్థాలు, అసాంఘిక శక్తులను గుర్తించడం వంటి లక్ష్యాలతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.