News September 9, 2025
ప్రొద్దుటూరు: బార్‌లుగా మారిన బ్రాంది షాపులు

మద్యం దుకాణల్లో బల్లలు వేసి, మద్యం తాగించడానికి పర్మిట్ రూములకు అనుమతులు పొందారు. ప్రొద్దుటూరు ప్రోహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 21 మద్యం దుకాణాలు ఉన్నాయి. మున్సిపాలిటీలో 18, రూరల్ ప్రాంతంలో 3 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇక్కడి మద్యం దుకాణాల యజమానులు పర్మిట్ రూముల ఏర్పాటుకు ప్రభుత్వానికి మున్సిపాలిటీలో ఏడాదికి రూ.7.50 లక్షలు, రూరల్‌లో రూ.5 లక్షలు చొప్పున 3 నెలలకు డబ్బులు చెల్లించారు.
Similar News
News March 22, 2026
జమ్మలమడుగు యువకుడికి ఆల్ ఇండియా ర్యాంక్

జమ్మలమడుగు (M) ఎస్. ఉప్పలపాడు గ్రామానికి చెందిన తలారి మోహన్ గేట్ ప్రవేశ పరీక్షలో ప్రతిభ చాటాడు. తాజాగా విడుదలైన ఫలితాల్లో మెకానికల్ ఇంజినీరింగ్ (ప్రొడక్షన్ & ఇండస్ట్రియల్) విభాగంలో ఆల్ ఇండియా 89వ ర్యాంక్ సాధించి ప్రాంతానికి గర్వకారణంగా నిలిచాడు. ప్రస్తుతం కర్నూలులోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మోహన్ తల్లిదండ్రులు సంజీవరాయుడు, లక్ష్మీదేవి, స్నేహితులు ఆనందం వ్యక్తం చేశారు.
News March 22, 2026
ఒంటిమిట్టలో ఆక్రమణలు తొలగిస్తారా..?

ఒంటిమిట్ట కోదండరామాలయంలోని పంచాయతీ స్థలాలు ఆక్రమణలు పరిపాటిగా మారాయి. ప్రజలు, భక్తులు నడిచే కాలినడక బాటను సైతం దుకాణాల పేరుతో వదిలారన్నారు. మండల అధికార యంత్రానికి విషయం తెలిసినా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అక్రమణలపై చేయి కుడా వేయలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లను జయించి అధికార యంత్రాగం ఆక్రమణలు తొలగిస్తుందా.. లేక ఎప్పటిలాగే కళ్లుమూసుకుంటుందా వేచి చూడాలని విశ్లేషకులు అంటున్నారు.
News March 22, 2026
కడప: MP మహేశ్‌కు మద్దతుగా బ్యానర్లు

కొద్దిరోజులుగా డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏలూరు MP పుట్టా మహేశ్ యాదవ్‌కి మద్దతుగా కడప జిల్లాలో పలుచోట్ల బ్యానర్లు వెలిశాయి. మైదుకూరు నియోజకవర్గం మొర్రాయిపల్లి రోడ్డులో న్యాయం నిలుస్తుంది, నిజాయితి గెలుస్తుంది.. వీ స్టాండ్ విత్ పుట్టా మహేశ్, ఇట్లు చాపాడు మండల ప్రజలు అనే వాక్యాలతో బ్యానర్‌లో రాసి ఉంది.


