News September 9, 2025

చేర్యాల: ‘చిన్ని చేతులు.. పెద్ద ఆలోచనలు’

image

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం సుభాష్ గూడెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మంగళవారం మొక్కలు నాటారు. అమ్మ పేరున ఒక మొక్క నాటే కార్యక్రమంలో భాగంగా జిల్లా ఉద్యోగులు చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్న చేతులతో మొక్కలు నాటి సమాజానికి గట్టి సందేశం ఇచ్చారు. చిన్నారుల ఆలోచనకు ఉపాధ్యాయులు అభినందించారు.

Similar News

News March 5, 2026

యుద్ధంపై బెట్టింగ్.. ₹కోట్లు గెలుచుకున్నారు!

image

US-ఇరాన్ యుద్ధంతో ఓ పక్క ప్రపంచం అల్లకల్లోలం అవుతుంటే కొందరు బెట్టింగ్ రాయుళ్లు మాత్రం కాసులపంట పండించుకున్నారు. ఇరాన్‌పై US ఎప్పుడు దాడి చేస్తుందో అంచనా వేసి పాలీమార్కెట్ అనే క్రిప్టో ప్లాట్‌ఫామ్‌లో గత శుక్రవారం 150 మంది బెట్ కాశారు. వీరిలో 16 మంది లక్ష డాలర్లు, ఓ వ్యక్తి 5లక్షల డాలర్లు (₹4కోట్లు) సంపాదించారు. అయితే యుద్ధంపైన బెట్టింగ్ ఏంటని పాలీమార్కెట్ సహా యూజర్లపై విమర్శలు వస్తున్నాయి.

News March 5, 2026

కర్నూలు: 395 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

image

పత్తికొండ శ్రీ వైష్ణవి డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్, ప్రిన్సిపల్ రాజశేఖర్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో వివిధ కంపెనీలలో 395 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఫార్మసీ చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని తెలిపారు.

News March 5, 2026

విశాఖ భూగర్భంలో రెడీగా మిలియన్ టన్నుల చమురు!

image

మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ నేపథ్యంలో మన దేశంలో ముడి చమురు నిల్వల సామర్థ్యం చర్చనీయాంశమైంది. అయితే ఇంధన సంస్థల నిల్వలతో పాటు విశాఖ, కర్ణాటకలోని మంగళూరు, పడూరులో అండర్‌గ్రౌండ్‌లో 5.3 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు భద్రంగా ఉందని తెలుసా? వీటినే స్ట్రాటజిక్ పెట్రోలియమ్ రిజర్వ్స్ అంటారు. 2015లో ఫేజ్-1 లాంచ్ కాగా మరిన్ని ఏర్పాటుకానున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ఉండేందుకు వీటిని తీసుకొచ్చారు.