News September 9, 2025

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రేవంత్ భేటీ

image

TG: రీజినల్ రింగ్ రోడ్డు పనుల ప్రారంభానికి అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్ కోరారు. దీనికి సంబంధించి 90% భూసేకరణ పూర్తయిందని ఆయనకు వివరించారు. రావిర్యాల-అమన్‌గల్-మన్ననూర్ రోడ్డును 4 వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారిగా నిర్మించాలని కోరారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవేకు అనుమతివ్వాలని గడ్కరీకి విజ్ఞప్తి చేశారు.

Similar News

News September 10, 2025

గేట్‌కు దరఖాస్తు చేశారా?

image

<>GATE<<>>-2026కు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్ వంటి 30 సబ్జెక్టులకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. విద్యార్థులు సెప్టెంబర్ 28వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో మంచి స్కోరు సాధిస్తే IIT, NIT, IISC వంటి ఇన్‌స్టిట్యూట్లలో ఎంటెక్/ఎంఈ/పీహెచ్‌డీల్లో చేరవచ్చు.

News September 10, 2025

భారత్ దెబ్బ.. దారికొస్తున్న ట్రంప్!

image

భారత్‌పై పెత్తనం చెలాయిద్దామనుకుంటున్న ట్రంప్ పాచికలు పారడం లేదు. 50% టారిఫ్స్ వేసినా ఇండియా వెనక్కి తగ్గలేదు. రష్యాతో ఆయిల్ కొనుగోళ్లను మరింత పెంచింది. చైనాతోనూ వాణిజ్య సంబంధాలు పునరుద్ధరిస్తోంది. ఇవన్నీ మింగుడుపడని ట్రంప్ దెబ్బకు దిగొచ్చారు. ట్రేడ్ విషయంలో IND-US సక్సెస్‌ఫుల్ కన్‌క్లూజన్‌కు వస్తాయనుకుంటున్నట్లు తాజాగా ప్రకటించారు. PM మోదీతో <<17663735>>మాట్లాడేందుకు<<>> ఎదురుచూస్తున్నానని చెప్పడం కొసమెరుపు.

News September 10, 2025

రూ.200 కోట్ల క్లబ్‌లో ‘కొత్త లోక’

image

‘ప్రేమలు’ ఫేమ్ నస్లేన్, కళ్యాణీ ప్రియదర్శన్ జంటగా నటించిన ‘కొత్త లోక’ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన 13 రోజుల్లోనే రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. డొమినిక్ అరుణ్ రూపొందించిన ఈ మూవీని దుల్కర్ సల్మాన్ నిర్మించారు. గత నెల 29న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. హీరోయిన్‌కు సూపర్ పవర్స్ ఉంటే ఏం జరుగుతుందనేది ఈ సినిమా కథ.