News September 9, 2025

ఓయూ లైజన్ ఆఫీసర్ దీపక్ కుమార్‌కు పదోన్నతి

image

ఉస్మానియా యూనివర్సిటీ లైజన్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దీపక్ కుమార్‌కు పదోన్నతి లభించింది. ప్రస్తుతం సూపరింటెండెంట్‌గా ఉన్న ఆయనను అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పదోన్నతి కల్పిస్తూ వీసీ ప్రొ.కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు. గతంలో ఆయన కీలకమైన డాక్, స్టోర్స్, స్టేషనరీ వంటి విభాగాలలో పనిచేశారు. ఓయూ ఉద్యోగ సంఘం నాయకుడిగా సైతం బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు.

Similar News

News March 10, 2026

HYD: MNC కంపెనీల్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం

image

ప్రముఖ MNC కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 137 మందిని మోసం చేసిన ముఠా గుట్టును బాచుపల్లి పోలీసులు రట్టు చేశారు. నిజాంపేట్‌కు చెందిన జగదీశ్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఈ కేసులో, నకిలీ ఆఫర్ లెటర్లు ఇచ్చి నిందితులు దాదాపు రూ.50 లక్షలు వసూలు చేసినట్లు తేలింది. పోలీసులు ప్రధాన నిందితుడు జక్కుల అజయ్‌ను అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు శ్రావణి, సద్గుణ్ కోసం గాలిస్తున్నారు.

News March 10, 2026

HYD: మెట్రో.. ఇలా నడిపితే డేంజరే!

image

మెట్రో పెచ్చులూడుతున్నా.. ఆఫీసర్లు తేరుకోవడం లేదు. గతంలో అమీర్‌పేట్ స్టేషన్‌లో జరిగిన విషాదం(మౌనిక మృతి) తర్వాత కూడా మెట్రో భద్రతపై సమగ్ర ఆడిట్ రిపోర్టును ప్రభుత్వం ప్రజల ముందు ఉంచలేదు. 2025లో జరిగిన అంతర్గత తనిఖీల్లో Non-Air కండిషన్డ్ ఏరియాల్లో స్లాబ్ ఫెయిల్యూర్ సంకేతాలు ఉన్నట్లు తేలినా కాస్మెటిక్ రిపేర్లతో సర్దుబాటు చేశారు. థర్డ్ పార్టీ సేఫ్టీ సర్టిఫికేషన్ లేకుండానే మెట్రో రైళ్లను నడపడం డేంజరే.

News March 10, 2026

HYDలో రూ.430 కోట్లతో మరో కేబుల్ బ్రిడ్జ్

image

HYDలో మరో కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వం ఓకే చెప్పింది. మీర్ ఆలం ట్యాంక్ మీదుగా ఈ కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తారు. దీనిని 2.65 KMల పొడవు, 22.2 మీటర్ల వెడల్పుతో నిర్మించనున్నారు. ఈ బ్రిడ్జి మీర్ ఆలం ట్యాంక్ సమీపంలోని NH 44 నుంచి మీర్ ఆలం పార్క్ సమీపంలోని చింతల్మెట్ రోడ్డు వరకు ఉంటుంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.430 CR మంజూరు చేసింది. MP అసదుద్దీన్ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పారు.