News September 9, 2025
జనగామ జిల్లాలో మంగళవారం టాప్ న్యూస్!

> జిల్లా వ్యాప్తంగా కాళోజీ జయంతి వేడుకలు
> ఫొటో ఎక్స్పో పోస్టర్‌ను ఆవిష్కరించిన పాలకుర్తి MLA
> బచ్చన్నపేట: ఆగి ఉన్న లారీని ఢీకొని టాటా ఏస్ దగ్ధం
> జనగామలో ఏబీవీపీ నేతల నిరసన
> లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష
> దేవరుప్పులలో పర్యటించిన కలెక్టర్
> ఇందిరమ్మ ఇళ్లకు నగదు త్వరగా జమ అయ్యేలా చూడాలి: కలెక్టర్
> అక్రమ ఇసుక రవాణా 4 ట్రాక్టర్లు పట్టివేత
Similar News
News March 10, 2026
‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: భద్రాద్రి కలెక్టర్

ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలను జిల్లాలో పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తుకు పదో తరగతి పరీక్షలు కీలకమని, ఎక్కడా చిన్న పొరపాట్లకు తావులేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
News March 10, 2026
చివ్వెంల: విషాదం.. కరెంట్ షాక్‌తో యువ రైతు మృతి

ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ సరఫరాను తనిఖీ చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్‌కు గురై వీరబోయిన సైదులు (32) అనే యువ రైతు మృతి చెందాడు. మంగళవారం చివ్వెంల మండలం వట్టిఖమ్మం పహాడ్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లిన సైదులు, కరెంట్ సరఫరాను సరిచేసే క్రమంలో ప్రాణాలు వదలడంతో గ్రామంలో విషాదం ఛాయలు నెలకొన్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
News March 10, 2026
నాగర్ కర్నూల్: ప్రశాంతంగా 10వ రోజు ఇంటర్ పరీక్షలు

నాగర్ కర్నూల్ జిల్లాలో 10వ రోజు ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని నోడల్ అధికారి వెంకటరమణ తెలిపారు. మొత్తం 6,059 మంది విద్యార్థులకు గానూ 5,863 మంది హాజరయ్యారు, 196 మంది గైర్హాజరయ్యారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.


