News September 10, 2025

HYD: బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న రిపోర్టర్ల అరెస్ట్

image

రెవెన్యూ అధికారుల పేరుతో డబ్బు వసూలు చేస్తున్నరిపోర్టర్లను నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సతీశ్, శ్యామకూరి శివగౌడ్‌ను ఈ కేసులో అరెస్ట్ చేశారు. మూడో నిందితుడు దామెర నాగఫణీంద్ర పరారీలో ఉన్నాడు. 2025 APR 19న ఫతుల్లాగూడలో బోరు వేయిస్తున్న ఓ వ్యక్తిని బెదిరించి రూ.20 వేలు, రూ.12 వేలు గూగుల్ పేలో కొట్టించుకున్నారని సీఐ మక్బూల్ జానీ తెలిపారు.

Similar News

News March 12, 2026

మళ్లీ 100 డాలర్లకు ఆయిల్ ధర

image

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర $100 దాటింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత $120 చేరువైన రేట్లు.. ఉద్రిక్తతలు ముగింపునకు వచ్చిందన్న ట్రంప్ ప్రకటనతో ఇటీవల $89కు దిగొచ్చాయి. కానీ తాజాగా హార్ముజ్‌లో చమురు నౌకలపై ఇరాన్ దాడి, ఇరాక్ సహా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ నిల్వ కేంద్రాలపై దాడితో ఆయిల్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి.

News March 12, 2026

ఉలవ పంటలో బూడిద తెగులు – నివారణ

image

అధిక తేమ, రాత్రి, పగలు ఉష్ణోగ్రతల్లో ఎక్కువ వ్యత్యాసం ఉన్నప్పుడు ఉలవ పంటలో బూడిద తెగులు వ్యాపిస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి కార్బండిజం 50% W.P 1గ్రామును కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటే ఇదే మందును ఇదే మోతాదులో 15 రోజుల వ్యవధిలో రెండోసారి కూడా పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News March 12, 2026

భద్రాచలం: భారీ సంఖ్యలో మావోయిస్టుల లొంగుబాటు

image

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ఉద్యమానికి భారీ విఘాతం కలిగింది. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీకి చెందిన 108 మంది మావోయిస్టులు రాష్ట్ర DGP అరుణ్ దేవ్ గౌతమ్ ఎదుట లొంగిపోయారు. వీరిచ్చిన సమాచారంతో పోలీసులు జరిపిన గాలింపులో భారీ డంపు బయటపడింది. ఇందులో ₹3.65 కోట్ల నగదు, ₹1.64 కోట్ల విలువైన బంగారంతో పాటు AK-47, LMG వంటి 101 అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు చరిత్రలో ఇది అతిపెద్ద లొంగుబాటు.