News September 10, 2025

జిల్లాలో 64 మంది ఉత్తమ ఉపాధ్యాయులు: ఆసిఫాబాద్ డీఈవో

image

ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కమిటీ ప్రతిపాదనల ఆధారంగా 64 మంది 2025 ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు DEO దీపక్ తివారి తెలిపారు. రేపు జిల్లా కేంద్రంలో వీరికి పురస్కారాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో 4 GHMలు, 22 స్కూల్ అసిస్టెంట్, PS HMలు, 14 మంది SGTలు, 3 KGBV టీచర్లు, 2 IERPలు, 13 TWD ఉపాధ్యాయులు, 6 ప్రత్యేక కేటగిరి పురస్కారాలు అందించనున్నట్లు తెలిపారు.

Similar News

News March 15, 2026

మచిలీపట్నంలో రేపు మీకోసం: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని సూచించారు.

News March 15, 2026

VZM: జిల్లాలో 1,11,369 మంది అభ్యాసకులు అక్షరాంధ్ర పరీక్షకు హాజరు

image

విజయనగరం జిల్లా వ్యాప్తంగా అక్షరాంధ్ర పరీక్షను 1,277 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించగా 1,11,369 మంది అభ్యాసకులు హాజరైనట్లు జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి తెలిపారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత పరీక్ష పేపర్ మూల్యాంకనం చేసి ఫలితాలు వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.

News March 15, 2026

మోగిన ఎన్నికల నగారా.. ఫుల్ డీటెయిల్స్ ఇవే

image

తమిళనాడు, బెంగాల్, కేరళం, అస్సాం, పుదుచ్చేరి(UT)లో ఎన్నికల నగారా మోగింది. 824 నియోజకవర్గాల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. బెంగాల్‌లో అత్యధికంగా 294, TN-234, కేరళం-140, అస్సాం-126, పుదుచ్చేరిలో 30 స్థానాలున్నాయి. 17.4 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందుకోసం 2.19లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. 25 లక్షల మంది అధికారులు ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు.