News September 10, 2025

ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 10,5681 క్యూసెక్కుల వరద

image

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 10,5681 క్యూసెక్కుల వరద నీరు చేరింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 37,500, క్యూసెక్కులు, కడెం నుంచి 9,913 క్యూసెక్కుల నీరు చేరింది. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు.. నీటి నిల్వ 20.175 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి 10,5681 క్యూసెక్కులు గోదావరి నదిలోకి, హైదరాబాద్ మెట్రో వాటర్ స్కీమ్‌కు 211 క్యూసెక్కులు విడుదల చేశారు.

Similar News

News March 19, 2026

కర్నూలు: ప్రేమ వివాహానికి ప్రతీక ‘పిడకల సమరం’

image

కర్నూ(D) ఆస్పరి మండలం కైరప్పలలో ఉగాది పండుగ సందర్భంగా వీరభద్ర ఆలయానికి ఓ ప్రత్యేక కథ ఉంది. భద్రకాళి, వీరభద్రుడి ప్రేమ వివాహం వివాదంగా మారిందని, పండుగ మరుసటి రోజు ఇక్కడి భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి పేడతో చేసిన పిడకలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ సంప్రదాయ భక్తిని కొనసాగిస్తారని పురాణాల్లో ఉంది. ఈ పిడకల సమరాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్థులు భారీగా తరలి వస్తారు.

News March 19, 2026

వచ్చే నెలలో క్యాబినెట్ విస్తరణ!

image

TG: ఏప్రిల్ తొలి వారంలో రాష్ట్ర క్యాబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ అనుమతించిందని తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రివర్గంలో ఖాళీల భర్తీ, ఒకరిద్దరు కొత్త వారిని తీసుకోవడంపై అధిష్ఠానంతో CM రేవంత్ చర్చించారని సమాచారం. పలువురి శాఖలు మార్చేందుకూ పర్మిషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తరచూ వివాదాస్పదమవుతున్న మంత్రిపై వేటు పడుతుందని, కొత్తగా లంబాడా నేతకు ఛాన్స్ దక్కనుందని చర్చ సాగుతోంది.

News March 19, 2026

నిజామాబాద్: ‘బ్యాంక్ ఖాతాలు విక్రయం.. ఐదుగురి అరెస్ట్’

image

నిజామాబాద్ జిల్లాలో అక్రమంగా బ్యాంక్ ఖాతాలు తెరిచి సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్న నెట్‌వర్క్‌ను పోలీసులు బట్టబయలు చేశారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఈ ఖాతాల ద్వారా మూడు నెలల్లో రూ.31 కోట్ల లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఇంకా మరికొంతమంది ప్రమేయం ఉన్నట్లు అనుమానంతో విచారణ కొనసాగుతోంది. ప్రజలు తమ బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోకూడదని సీపీ హెచ్చరించారు.