News September 10, 2025
బెల్లంపల్లి: కానిస్టేబుల్‌పై దాడి.. కేసు నమోదు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బూధకలాన్ గ్రామంలో ఈనెల 6న గణేశ్ నిమజ్జన ఉత్సవాల్లో పోలీస్ కానిస్టేబుల్ శివ శంకర్ సింగ్‌పై కొందరు యువకులు దాడి చేశారని తాళ్లగురిజాల ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. ఇరువర్గాల వారు గొడవ చేసుకుంటున్నారని 100 డయల్‌కు ఫోన్ రాగా ఘటనా స్థలానికి చేరుకుని వారిని అడ్డుకున్నారని, గణేశ్, మహేందర్‌తోపాటు మరికొంత మంది శివశంకర్ సింగ్‌పై దాడి చేశారని, వారిపై కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News March 14, 2026
FLASH.. కేయూ మాజీ వైస్ ఛాన్స్‌లర్ లింగమూర్తి మృతి

కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్‌లర్ లింగమూర్తి ఈరోజు మధ్యాహ్నం 12:20 గం.కు మృతి చెందారు. ఆయనకు భార్య అంజలి, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. గత ఆరు మాసాలుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు నెలలుగా హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్యం క్షీణించడంతో వారం రోజుల క్రితం ఆయన నివాసానికి తీసుకురాగా ఈరోజు తుది శ్వాస విడిచారు.
News March 14, 2026
పెద్దపల్లి: యువతకు మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ ప్రారంభం

పెద్దపల్లి జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మెడికల్ కోడింగ్ & బిల్లింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఈ శిక్షణ మార్చి 16 నుంచి పెద్దపల్లి TASK రీజినల్ సెంటర్‌లో ప్రారంభం కానుందని, ఫార్మసీ, బయోటెక్నాలజీ విద్యార్థులు నమోదు చేసుకోవాలని సూచించారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.