News September 10, 2025
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి: నిర్మల్ కలెక్టర్

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, హౌసింగ్ పీడీ రాజేశ్వర్, మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 2, 2026
ట్రంప్ వ్యాఖ్యలు పచ్చి అబద్ధం: ఇరాన్

సీజ్‌ఫైర్ కోసం ఇరాన్ అభ్యర్థించిందన్న <<19538873>>ట్రంప్<<>> వ్యాఖ్యలను ఆ దేశం ఖండించింది. అవన్నీ అబద్ధమని, అందుకు ఎటువంటి ఆధారాలు లేవని ఇరాన్ విదేశాంగ శాఖ తాజాగా స్పష్టం చేసింది. దేశంలో అధికార మార్పిడి జరగలేదని, పాత అధ్యక్షుడే కొనసాగుతున్నారని పేర్కొంటూ ట్రంప్ పోస్ట్‌ను కొట్టిపారేసింది.
News April 2, 2026
గ్రామ సభలను విజయవంతం చేయాలి: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు గ్రామ సభలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. గ్రామ, వార్డు సభల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, పథకాలపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు.
News April 2, 2026
శోకసంద్రమైన బోడ మాణిక్యం తండా!

హైదరాబాద్‌లో తల్లి స్రవంతి తన ఇద్దరు చిన్నారులకు ఉరివేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలిసిందే. తల్లి స్రవంతి, చిన్నారుల మృతదేహాలు బోడ మాణిక్యం తండాకు బుధవారం చేరుకున్నాయి. పార్థివ దేహాలను చూసిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తండా మొత్తం దుఃఖసంద్రంగా మారి ఆర్తనాదాలతో మార్మోగింది. ఘటనపై స్థానికుల్లో ఆగ్రహం, ఆవేదన వ్యక్తమవుతోంది.


