News September 10, 2025

ఇకపై ఓయూ విద్యార్థులకు ఏఐ, ఎంఎల్ నైపుణ్యాలు

image

ఓయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు AI, మిషన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్ రంగాలలో నైపుణ్యాలు పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఏఐ లింక్ టెక్నాలజీస్ సంస్థతో ఓయూ ఇంజినీరింగ్ కళాశాల అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థులను అత్యాధునిక నైపుణ్యాలతో నిపుణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇరువర్గాలు ఒప్పందంపై సంతకాలు చేశారు. JNTUHలో ఇప్పటికే ఈ పద్ధతిలో బోధిస్తున్నారు.

Similar News

News March 28, 2026

ఒక్కో సినిమాకు రూ.15-20 కోట్లు.. నిర్మాతల భయం!

image

‘పుష్ప’, ‘పుష్ప-2’ సినిమాలతో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్‌కు తెలుగులో ఎన్నో ఆఫర్లు వచ్చాయి. కానీ ఆయన ఒక్క మూవీ కూడా ఒప్పుకోలేదు. ఒక్కో చిత్రానికి రూ.15-20 కోట్ల వరకు డిమాండ్ చేయడమే దీనికి కారణమని టాలీవుడ్ వర్గాల టాక్. ఆ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు భయపడే నిర్మాతలు ముందుకు రావట్లేదని సమాచారం.

News March 28, 2026

MBNR: కొత్త పింఛన్ కోసం.. నాలుగేళ్లుగా ఎదురుచూపు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్త పింఛన్ల కోసం ఆశావాహులు నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. అప్పటి BRS ప్రభుత్వంలో మంజూరైన పింఛన్లను ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుంది. కొత్తగా 2 లక్షల పింఛన్లు మంజూరు చేస్తామని తాజా బడ్జెట్‌లో ప్రకటించడంతో లబ్ధిదారుల్లో ఆశలు మరింత పెరిగాయి. ఇప్పటికే చాలా వరకు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకొని ఉన్నారు. మరి ఎదురుచూపులకు తెరపడేనా..!

News March 28, 2026

ఈ లెజెండరీ IPL టీమ్‌పై మీ అభిప్రాయం?

image

IPL చరిత్రలోని బెస్ట్ ప్లేయర్స్‌తో కూడిన టీమ్‌ను స్పోర్ట్స్‌కీడా ఇలా సెలక్ట్ చేసింది. వార్నర్, రోహిత్ (కెప్టెన్) ఓపెనర్లుగా, కోహ్లీ, రైనా, డివిలియర్స్ మిడిల్ ఆర్డర్‌లో బలంగా నిలుస్తారు. ధోని కీపర్‌గా.. పాండ్య, జడేజా ఆల్‌రౌండర్లుగా రాణిస్తారు. బౌలింగ్‌లో సునీల్ నరైన్, బుమ్రా, మలింగ, యుజ్వేంద్ర చాహల్ ఉన్నారు. ఈ జట్టుపై మీ అభిప్రాయం ఏంటి? ఏదైనా మార్పులు చేస్తారా? Comment