News September 10, 2025

జిల్లాలో ఎరువుల కొరత లేదు: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో ఎక్కడా యూరియా, ఎరువుల కొరత లేదని కలెక్టర్ కె. వెట్రిసెల్వి మంగళవారం తెలిపారు. పోలవరం మండలం ప్రగడపల్లి సొసైటీలో 25 మెట్రిక్ టన్నులు, జిల్లెళ్లగూడెం, వింజరం రైతు సేవా కేంద్రాలకు 12.5 మెట్రిక్ టన్నుల చొప్పున ఒక్కరోజులోనే అదనంగా సరఫరా చేశామని చెప్పారు. రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు అందిస్తామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు.

Similar News

News March 15, 2026

గొల్లపల్లి: ఇంటి మనస్పర్ధలు.. గోదావరిలో యువకుడి మృతి

image

గొల్లపల్లి మండలం చిల్వకోడూరు గ్రామానికి చెందిన కాంపల్లి రాము (26) <<19391989 >>మృతదేహం<<>> కోటిలింగాల గోదావరి నదిలో లభ్యమైంది. ఇంట్లో మనస్పర్ధల కారణంగా ఈ నెల 13న ఉదయం 11:30 గంటల సమయంలో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కాగా, ఆదివారం ఉదయం కోటిలింగాల వద్ద గోదావరిలో అతని మృతదేహం కనిపించింది. మృతుడి తమ్ముడు కాంపల్లి లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు గొల్లపల్లి ఎస్ఐ కృష్ణా సాగర్ రెడ్డి తెలిపారు.

News March 15, 2026

‘ఉస్తాద్’ అందుకే లేట్ అయింది: హరీశ్ శంకర్

image

కథ మారినందుకే ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల ఆలస్యమైందని ప్రీరిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ హరీశ్ శంకర్ తెలిపారు. తొలుత అనుకున్న స్టోరీ సెట్ కాకపోవడంతో స్క్రిప్ట్ మార్చడం, కరోనా వంటి కారణాలతో లేట్ అయిందన్నారు. ఈ జర్నీలో ప్రొడ్యూసర్స్, పవన్ కళ్యాణ్ అండగా నిలిచారని పేర్కొన్నారు. ఇక మూవీ ఆలస్యంపై కొందరు కథలుకథలుగా మాట్లాడుకున్నారని, అది సృష్టి ధర్మమని హరీశ్ సెటైర్ వేశారు. ఈ సారి పండుగ ఉస్తాద్ ఉగాది అన్నారు.

News March 15, 2026

అమలాపురం: బాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో దంపతుల విజయం

image

అమలాపురం బాలయోగి స్టేడియంలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి బాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ టోర్నమెంట్‌లో రాజమండ్రికి చెందిన దంపతులు తమ అద్భుత ప్రతిభతో విజేతలుగా నిలిచారు. రాజీ, విజయ్‌ జంట క్రీడా మైదానంలో ఒకరికొకరు చక్కని సమన్వయంతో ఆడి ప్రత్యర్థులపై పైచేయి సాధించారు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకే జట్టుగా ఆడి విన్నర్స్‌ ట్రోఫీని కైవసం చేసుకోవడం అక్కడి క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.