News September 10, 2025

ఆసియా కప్: హాంకాంగ్‌పై అఫ్గాన్ విజయం

image

ఆసియా కప్-2025 తొలి మ్యాచులో హాంకాంగ్‌పై అఫ్గానిస్థాన్ 94 రన్స్ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 188/6 స్కోర్ చేసింది. సెదిఖుల్లా అటల్ (73), అజ్మతుల్లా (53) రాణించారు. అనంతరం ఛేదనలో హాంకాంగ్ 20 ఓవర్లలో 94-9 స్కోర్ మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు బ్యాటర్లలో బాబర్ హయత్ (39) టాప్ స్కోరర్‌గా నిలిచారు.

Similar News

News September 10, 2025

లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు

image

స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 390 పాయింట్లు లాభపడి 81,489 వద్ద, నిఫ్టీ 118 పాయింట్లు వృద్ధి చెంది 24,990 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. HCL టెక్, TCS, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, బెల్, L&T, కొటక్ బ్యాంక్, యాక్సిస్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సన్ ఫార్మా, మారుతీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, ఎటర్నల్, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

News September 10, 2025

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు క్రమంగా పెరుగుతూ ఆల్ టైమ్ రికార్డుకు చేరుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.219 పెరిగి రూ.1,10,509కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10g గోల్డ్ రూ.200 ఎగబాకి రూ.1,01,300 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,40,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News September 10, 2025

బవుమాకు మళ్లీ అవమానం!

image

SA టీ20 లీగ్‌ వేలంలో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. 2 లక్షల ర్యాండ్‌ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన అతడిపై ఏ ఒక్క ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. దీంతో బవుమా అన్‌సోల్డ్‌గా మిగిలారు. గత సీజన్‌లోనూ ఆయన అమ్ముడుపోలేదు. కాగా టీ20 ఫార్మాట్‌లో బవుమా 36 మ్యాచుల్లో 118 స్ట్రైక్ రేట్‌తో 670 పరుగులు చేశారు. గతంలో దక్షిణాఫ్రికా టీ20 జట్టుకు నాయకత్వం కూడా వహించారు.