News April 4, 2024
నల్గొండ జిల్లాలో కరవు రాజకీయం

ఉమ్మడి నల్గొండ జిల్లాలో లోక్ సభ ఎన్నికల ప్రచారం కరవు చుట్టూ తిరుగుతోంది. సాగర్ కాల్వతో పాటు బోరు బావుల కింద పంటలు ఎండిపోవడానికి కారణం గత ప్రభుత్వమే అని మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం విమర్శించారు. తమ హయాంలో నీళ్లు ఇచ్చామని చెబుతూ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. మరి మీరేమంటారు.
Similar News
News March 24, 2026
సేద్యంపై ‘శాపం’.. ఎండిపోతున్న పైర్లు

నల్గొండ జిల్లాలో సాగునీరు అందక పంట పొలాలు కళ్లముందే ఎండిపోతుండటంతో రైతులు అల్లాడిపోతున్నారు. మునుగోడు మండలం ఉకోండిలో భూగర్భ జలాలు అడుగంటి, బోర్లు పోయక పరిస్థితి దారుణంగా మారింది. చేతికొచ్చే దశలో వరి, ఇతర పంటలు ఎండుతుండటంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడి దక్కేలా లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం స్పందించి సాగునీటి ఇబ్బందులను తొలగించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
News March 24, 2026
NLG: ఖర్చుల లెక్కల్లో ‘నిర్లక్ష్యం’

జిల్లాలోని పురపాలక ఎన్నికలు ముగిసి నెల రోజులు కావస్తున్నా, పోటీ చేసిన అభ్యర్థుల్లో చాలామంది తమ ఎన్నికల ఖర్చుల వివరాలను సమర్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. NLG కార్పొరేషన్‌తో పాటు మిగిలిన 6 మున్సిపాలిటీల్లోని మెజారిటీ అభ్యర్థులు గడువు ముగుస్తున్నా లెక్కలు చెప్పకపోవడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. NLG జిల్లాలో ఇప్పటివరకు కేవలం 40% అభ్యర్థులు మాత్రమే లెక్కలు అప్పగించినట్లు సమాచారం.
News March 24, 2026
వంటగ్యాస్ కటకట.. బ్లాక్‌లో విక్రయాల జోరు!

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో జిల్లాలో వంటగ్యాస్ సరఫరా అస్తవ్యస్తమైంది. వాణిజ్య సిలిండర్ల పంపిణీ నిలిచిపోవడంతో గృహ వినియోగ గ్యాస్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. ఇదే అదనుగా కొందరు డెలివరీ బాయ్స్, హోటల్ నిర్వాహకులు కుమ్మక్కై అక్రమ దందాలకు తెరలేపారు. ఒక్కో సిలిండర్‌ను రూ. 2,500 వరకు విక్రయిస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. అధికారులు స్పందించి ఈ దోపిడీని అరికట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.


