News September 10, 2025

TDPపై మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫైర్

image

రైతుల కోసం ఉద్దేశించిన ఎరువులను టీడీపీ నాయకులే దారి మళ్లించి కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మంగళవారం మాచర్లలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు ఎరువుల కోసం ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. సచివాలయాలు, ఆర్బీకేలను సద్వినియోగం చేసుకొని రైతులకు యూరియాను ఎందుకు అందించడం లేదని ఆయన ప్రశ్నించారు.

Similar News

News March 19, 2026

ట్రెడిషనల్ లుక్‌లో నెల్లూరు కలెక్టర్

image

నెల్లూరు కలెక్టరేట్‌లో తెలుగుదనం ఉట్టిపడేలా ఉగాది సంబరాలు ప్రారంభం అయ్యాయి. ఉగాది వేడుకలను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ వేడుకల్లో కవులు, కళాకారులు, అధికారులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పండితులు పంచాంగ శ్రవణం చదువుతున్నారు. కలెక్టర్ ట్రెడిషనల్ లుక్ అందరిని ఆకట్టుకుంది.

News March 19, 2026

వనపర్తి: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్, ఎస్పీ

image

వనపర్తి జిల్లా ప్రజలకు కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీత రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారంతో తయారు చేసిన ఉగాది పచ్చడిలాగే మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టాసుఖాలు, ఆనందం బాధలన్నింటికీ ఉగాది పచ్చడి ప్రతీక అన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.

News March 19, 2026

మెదక్: విషాదం.. వ్యక్తి సూసైడ్

image

నిజాంపేట మండల కేంద్రంలో అప్పుల బాధ తాళలేక పంజా సత్తయ్య(46) అనే వ్యక్తి బుధవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్త ఇల్లు నిర్మించడంతో అప్పులు పెరిగి, తీవ్ర మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం రామాయంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.