News September 10, 2025
పెద్దాపురంలో యూరియా పంపిణీ: జేసీ

పెద్దాపురం మండలంలోని కట్టమూరులో రైతులకు యూరియా పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. విజయ్ కుమార్ పరిశీలించారు. శాస్త్రవేత్తలు సూచించిన విధంగానే యూరియా వినియోగించాలని రైతులకు రాహుల్ మీనా సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ ఎం. దైవ కుమార్, మండల వ్యవసాయ అధికారి కె. సంజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ దిమ్మల పుష్పరత్నం, ఎంపీటీసీ గుత్తుల సూర్యవతి పాల్గొన్నారు.
Similar News
News March 11, 2026
అన్నమయ్య: 4 రోజుల్లో ఆ ముఖ్య ఘట్టం..

రాజంపేట మండలం తాళ్లపాకలోని అన్నమయ్య జన్మస్థలంలో ఆయన 523వ వర్ధంతి వేడుకలు నిర్వహించనున్నట్లు TTD అధికారులు వివరించారు. ఈనెల 15 నుంచి 21 తేదీ వరకు తాళ్లపాకలోని ధ్యాన మందిరం, 108 అడుగుల విగ్రహం వద్ద వివిధ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 15వ తేదీ బహుళ ద్వాదశి- సప్తగిరి సంకీర్తనలు, గోష్టి గానంతో ఈ కార్యక్రమాలు మొదలవుతాయని అన్నారు. సాయంత్రం సింగపూర్ కళాకారులచే సంగీత సభ ఉంటుందన్నారు.
News March 11, 2026
TU: ఏప్రిల్ 8న స్టూడెంట్ ఔట్రీచ్ ప్రోగ్రాం

తెలంగాణ విశ్వవిద్యాలయం ఎకనామిక్స్ విభాగం ఆధ్వర్యంలో ఏప్రిల్ 8న ఆర్మూర్ మండలం గోవింద్ పేటలో “బహుళ పంటల సమ్మేళన వ్యూహం: ఏక పంట ఆధిపత్యం నుంచి సమగ్ర వ్యవసాయ వ్యవస్థల వైపు మారడం” అనే అంశంపై ఒక రోజు విద్యార్థుల అవగాహన & స్టూడెంట్ ఔట్రీచ్ ప్రోగ్రాం నిర్వహించనున్నట్లు HOD డా.స్వప్న తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం కార్యక్రమ బ్రోచర్లను ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు ఆవిష్కరించారు. అధ్యాపకులు పాల్గొన్నారు.
News March 11, 2026
కడప జిల్లా: ఒక్కరోజులో 274 కేసులు.!

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కడప ఎస్పీ షెల్కే నచికేత్ హెచ్చరించారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కారు ప్రయాణికులు సీట్ బెల్ట్ తప్పక ధరించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా మంగళవారం చేపట్టిన తనిఖీల్లో నిబంధనలు మీరిన వారిపై 274 కేసులు నమోదు చేసి రూ.56,615 జరిమానా విధించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై కూడా కఠినంగా వ్యవహరిస్తామన్నారు.


