News September 10, 2025

ఆసిఫాబాద్: ‘జిల్లాలో ఇసుక లభ్యతపై నివేదికలు రూపొందించాలి’

image

ఆసిఫాబాద్ జిల్లాలో ఇసుక లభ్యతపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఉన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి ఇసుక లభ్యతపై రెవెన్యూ, గనులు భూగర్భ, నీటి పారుదల, నీటి వనరుల, అటవీ, రోడ్లు భవనాల శాఖల అధికారులతో కమిటీ సమావేశం నిర్వహించారు.

Similar News

News March 13, 2026

ఎల్లుండి దానధర్మాలు చేస్తే?

image

MAR 15న సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. దీన్నే మీన సంక్రాంతి అంటారు. ఈ పవిత్రమైన రోజున జపాలు, పుణ్యస్నానాలు ఆచరించాలని పండితులు సూచిస్తున్నారు. ‘గత జన్మ పాపాల నుంచి విముక్తికై ఈరోజు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. లక్ష్మీనృసింహస్వామికి పాయసం నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున చేసే దానధర్మాలకు విశేష పుణ్యఫలం ఉంటుంది. ఇతరుల శ్రేయస్సు కోరి చేసే ఈ పనులతో కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి’ అంటున్నారు.

News March 13, 2026

ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టుపై వీడని ఉత్కంఠ

image

ADB విమానాశ్రయ భూసేకరణ వ్యవహారం గందరగోళంగా మారింది. బ్లూప్రింట్ సిద్ధమైందని నేతలు చెబుతుండగా, తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని కలెక్టర్‌ స్పష్టం చేయడం చర్చనీయాంశమైంది. రన్‌వే విస్తరణకు 249.81 ఎకరాలు అవసరం కానుంది. దీంతో భూములు ఎటువైపు పోతాయో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటనతో బాధితుల్లో భయం పెరిగింది. స్పష్టత ఇవ్వాలని ప్రజలు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు.

News March 13, 2026

HYD: ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీస్!

image

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేడు సా.4 గంటలకు సమ్మె నోటీస్ ఇవ్వనుంది. ఉద్యోగుల డిమాండ్లు- ఆర్టీసీ ప్రభుత్వ విలీనం, 2021 పీఆర్సీ, ఉద్యోగ భద్రత, బస్సుల సంఖ్య పెంపు, ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు వంటి 11 అంశాలు- పరిష్కారం కాకపోవడంతో సమ్మెకు నిర్ణయించారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను పట్టించుకోవడం లేదని జేఏసీ నేతలు విమర్శించారు.