News September 10, 2025

కొడంగల్: ‘నాణ్యమైన భోజనం అందించాలి’

image

వసతి గృహల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు మెరుగైన విద్య అందించాలని జిల్లా BC వెల్ఫేర్ అధికారులు మాధవ రెడ్డి, భీమ్ రాజ్ చెప్పారు. కొడంగల్ బాలుర BC వసతి గృహాన్ని వారు సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం, వసతులపై వార్డెన్ రాధికతో మాట్లాడారు. అనంతరం ‘పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి’ అని పేర్కొన్నారు.

Similar News

News March 14, 2026

ఇన్‌స్టాలో అవి చూసి మోసపోకండి!

image

ఇన్‌స్టాలో ఏదైనా వస్తువు కనిపించగానే అరే.. బాగుందే అనుకుంటాం. రేట్ కూడా తక్కువే ఉంది కదా కొందామని చూస్తే COD ఉండదు. వెంటనే ఆన్‌లైన్ పేమెంట్ చేసి బుక్ చేస్తాం. కానీ ఎన్నిరోజులైనా అది మీకు డెలివరీ అవ్వదు. ఎందుకంటే అది ఫేక్ షాపింగ్ వెబ్‌సైట్. ఇలాంటి సైట్లు కుప్పలుగా పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా మహిళలు వీటి బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. టెంప్ట్ అవ్వకుండా ట్రస్టెడ్ సైట్లలోనే షాపింగ్ చేయండి.

News March 14, 2026

HYD: పెళ్లి రోజే కుమారుడిని చంపి తల్లి సూసైడ్

image

పెళ్లి రోజు జరుపుకోవాల్సిన ఆ ఇంట్లో విషాదం నెలకొంది. దంపతుల మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం ఒకరి ప్రాణం తీయగా, మరో చిన్నారిని బలి తీసుకుంది. బోరబండ పెద్దమ్మనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సరదాగా బయటకు వెళ్దామని భార్య కోరగా భర్త నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మనస్తాపంతో పిల్లల గొంతు నులిమి సత్యవేణి సూసైడ్ చేసుకొంది. ఐదేళ్ల కుమారుడు చనిపోగా.. కూతురు ప్రాణాలతో బయటపడింది.

News March 14, 2026

సూర్యాపేట: ప్రశాంతంగా ముగిసిన తెలుగు పరీక్ష

image

జిల్లాలో శనివారం పదో తరగతి తెలుగు పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని డీఈవో అశోక్ తెలిపారు. 69 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు 12,355 మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను 12,342 మంది హాజరు కాగా 13 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. అధికారులు 37 కేంద్రాలను తనిఖీ చేశారని ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదని, పరీక్షలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగాయని డీఈవో తెలిపారు.