News September 10, 2025
నిర్మల్: ‘ఈనెల 12న జిల్లా స్థాయి ఉత్సవ్ పోటీలు’

జిల్లా స్థాయి కళా ఉత్సవ్-2025 పోటీలు ఈనెల 12న నారాయణ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు డీఈవో భోజన్న మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 9 నుంచి 12 తరగతుల విద్యార్థులు వోకల్ మ్యూజిక్, డాన్స్, థియేటర్, విజువల్ ఆర్ట్స్, స్టోరీ టెల్లింగ్ విభాగాల్లో పోటీకి అర్హులని తెలిపారు. విజేతలు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అవుతారని, ఆసక్తి గల వారు పాల్గొనాలని వారు కోరారు.
Similar News
News March 24, 2026
72 గంటల ముందుగా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఫుల్ రిఫండ్

టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీల్లో రైల్వే శాఖ కీలక మార్పులు చేసింది. ఇకపై 72 గంటల ముందుగా టికెట్‌ను రద్దు చేసుకుంటే పూర్తి మొత్తం(నామమాత్రపు ఫ్లాట్ క్యాన్సిలేషన్ ఛార్జీ కట్ అవుతుంది) తిరిగి ఇవ్వనుంది. 72 నుంచి 24 గంటల్లోపు అయితే 25 శాతం, 24 గంటల నుంచి 8 గంటల్లోపు అయితే 50 శాతం కట్ చేయనుంది. 8 గంటల్లోపు అయితే ఎలాంటి రిఫండ్ ఉండదు. ఏప్రిల్ 1 నుంచి 15 మధ్యలో ఈ రూల్స్‌ను అమల్లోకి తేనుంది.
News March 24, 2026
సేద్యంపై ‘శాపం’.. ఎండిపోతున్న పైర్లు

నల్గొండ జిల్లాలో సాగునీరు అందక పంట పొలాలు కళ్లముందే ఎండిపోతుండటంతో రైతులు అల్లాడిపోతున్నారు. మునుగోడు మండలం ఉకోండిలో భూగర్భ జలాలు అడుగంటి, బోర్లు పోయక పరిస్థితి దారుణంగా మారింది. చేతికొచ్చే దశలో వరి, ఇతర పంటలు ఎండుతుండటంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడి దక్కేలా లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం స్పందించి సాగునీటి ఇబ్బందులను తొలగించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
News March 24, 2026
సంచలనం.. యుద్ధంలోకి సౌదీ, UAE?

పశ్చిమాసియాలో యుద్ధం విస్తరించే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్‌పై అమెరికా చేస్తోన్న దాడుల్లో సౌదీ, UAE పాల్గొనేందుకు సిద్ధమైనట్లు ‘వాల్‌స్ట్రీట్ జనరల్’ వెల్లడించింది. తమ వైమానిక స్థావరాలను US వాడుకొనేందుకు సౌదీ ఓకే చెప్పినట్లు తెలిపింది. తమ దేశంలోని టెహ్రాన్‌కు చెందిన ఆస్పత్రి, క్లబ్‌ను UAE మూసేసినట్లు పేర్కొంది. తమ రిఫైనరీలపై ఇరాన్ దాడులను ఉపేక్షించబోమని ఇటీవల గల్ఫ్ దేశాలు ప్రకటించడం తెలిసిందే.


